Nothing Phone 3a Lite Launch: మనీ రెడీ చేసుకోండమ్మా.. నథింగ్ నుంచి చౌకైన స్మార్ట్‌ఫోన్, ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- భారత మార్కెట్లోకి ‘నథింగ్’ మరో మొబైల్
- 3 సిరీస్‌లో భాగంగా 'నథింగ్ ఫోన్ 3ఏ లైట్' రిలీజ్
- నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో భాగంగా ‘నథింగ్ ఫోన్ 3ఏ లైట్’ను రిలీజ్ చేయనుంది. నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. రిలీజ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో నథింగ్ ఇప్పటికే ఫోన్ 3, ఫోన్ 3a, ఫోన్ 3a ప్రోను విడుదల చేసింది. గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఇండియన్ డిజైన్ రానుంది. నథింగ్ నుంచి వస్తున్న ఈ చౌకైన స్మార్ట్‌ఫోన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
నథింగ్ ఫోన్ 3a లైట్ మొబైల్‌లో 6.77-అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే 387 పిక్సెల్ సాంద్రతను కలిగి ఉంది. దాంతో మంచి వీడియో, గేమింగ్ అనుభవం ఇస్తుంది. ఈ ఫోన్ 4nm MediaTek Dimensity 7300 Pro ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB RAM అండ్ 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్‌లతో రానుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
Also Read
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
Also Read: Eatala Rajendar: కుంగిపోవద్దు, భవిష్యత్తు మనదే.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై ఈటల!
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ అండ్ 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా ఉండడంతో ఈ ఫోన్ వీడియో, ఫోటోగ్రఫీకి అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ 3a లైట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినపుడు బేస్ వేరియంట్ (8GB RAM + 128GB స్టోరేజ్) ధర 249 యూరోస్ (సుమారు రూ.25,600)గా ఉంది. టాప్ వేరియంట్ (8GB RAM + 256GB స్టోరేజ్) ధర 279 యూరోస్ (సుమారు రూ.28,700)గా కంపెనీ నిర్ణయించబడింది. భారతదేశంలో ధర స్వల్పంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ పరిధిలోకి రానుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!