NTV Telugu Site icon

James Webb Space Telescope: అప్పుడే పుడుతున్న నక్షత్రాన్ని క్లిక్ మనిపించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

James Webb Space Telescope

James Webb Space Telescope

NASA’s James Webb Space Telescope Captures Never Before Seen Cosmic Clouds: నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫోటోలను తీసింది. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. తాజాగా జెమ్స్ వెబ్ మునుపెన్నడూ చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను తీసింది.

అప్పుడే పుట్టుకను ప్రారంభించిన ఓ నక్షత్రం చూస్తున్న విధ్వంసాన్ని క్లిక్ మనిపించింది. ప్రోటోస్టార్ ఎల్1527 నక్షత్రం ఏర్పడుతున్న క్రమంలో దాని చుట్టూ ఆవరించి ఉన్న కాస్మిక్ మేఘాలను ఫోటో తీసింది. ఈ నక్షత్రం టారస్ నక్షత్ర మండలంలో ఉంది. నక్షత్రం చుట్టూ ఉన్న మేఘాలు పరారుణ కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. వీటిని జేమ్స్ వెబ్ నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేయబడింది.

Read Also: UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం

నక్షత్రం నుంచి వెలువడుతున్న పదార్థం దాని చుట్టు పక్కల ఉన్న పదార్థంతో ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఎల్1527 నక్షత్రం వయసు కేవలం లక్ష ఏళ్లు మాత్రమే అని..ఒక నక్షత్ర వయసుతో పోల్చి చూస్తే ఇది కేవలం యవ్వన దశలో మాత్రమే ఉందని నాసా పేర్కొంది. దీన్ని నక్షత్ర ప్రారంభ దశ ప్రోటోస్టార్ గా పరిగణిస్తారు. ఇది భూమికి 430 కాంతి సంవత్సరా దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో వందలాది నక్షత్రాలు పడుతున్నాయి. గత జూలై నుంచి జెమ్స్ వెబ్ టెలిస్కోప్ సేవలను అందిస్తోంది. 10 బిలియన్ డాలర్ల భారీ ఖర్చుతో ఈ టెలిస్కోప్ ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు నిర్మించాయి.

జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ని భూమిని అత్యంత దూరంగా ఉండే లాగ్రేజ్ పాయింట్ (ఎల్2) కక్షలో ఉంచారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో జెమ్స్ వెబ్ ఉంది. అత్యంత స్థిరం ఉండేందుకు జేమ్స్ వెబ్ ని ఎల్2 కక్ష్యలో ఉంచారు శాస్త్రవేత్తలు. విశ్వం పుట్టుక, ఎక్సో ప్లానెట్స్, నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు జమ్స్ వెబ్ ని ప్రయోగించారు.