200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
- మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ లాంచ్..
- 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 12,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్
- వెనుకవైపు 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 200MP పెరిస్కోప్ కెమెరాలు
- 90W వైర్డ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు 7000mAh బ్యాటరీ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Signature 27: మోటరోలా (Motorola) అత్యాధునిక ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Motorola Signature 27ను లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అడ్వాన్స్డ్ కెమెరాలతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే AMOLED డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డ్యూయో డిస్ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 12,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 3ను ఉపయోగించారు. పనితీరు విషయానికి వస్తే.. ఇందులో Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 2nm ప్రాసెసర్ అందించారు. Adreno 850 GPUతో పాటు 12GB LPDDR5X RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ ఇచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఏకంగా ఏడేళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్డేట్స్ అందించనున్నట్లు మోటరోలా ప్రకటించింది.
Also Read
- Meta Layoffs: టెక్ ఉద్యోగులకు మరో షాక్.. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ప్రకటన..
- CERT-In Warning: "హ్యాక్ చేసే ప్రమాదం".. టాటా కార్ల వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ హెచ్చరిక..
- 9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
- భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో అధునాతన కెమెరా సెటప్ అందించారు. వెనుకవైపు 50MP సోనీ LYTIA L910 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులోని 200MP కెమెరా 3X ఆప్టికల్ జూమ్, 100X హైబ్రిడ్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. వేగంగా కదిలే వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేసేందుకు ప్రత్యేకంగా ఈవెంట్ బేస్డ్ విజన్ సెన్సార్ (EVS) అందించారు. వీడియో రికార్డింగ్ కోసం 4K 120fps డాల్బీ విజన్, 8K వీడియో సపోర్ట్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఇచ్చారు. ఇది 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్లో 7000mAh భారీ బ్యాటరీ అందించారు. దీనికి 90W టర్బో పవర్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కంపెనీ వివరాల ప్రకారం 90W ఛార్జింగ్‌తో సుమారు 12 నిమిషాల్లో ఒక రోజు వినియోగానికి సరిపడా ఛార్జింగ్ పొందవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 80 నిమిషాలు పడుతుంది. ఇంకా ఇందులో గూగుల్ జెమినీ ఇంటలిజెన్స్, మోటోరోలా Qira AI ఎకోసిస్టమ్ అందించారు. వీటి సహాయంతో వివిధ యాప్స్‌లో పనులను ఆటోమేటిక్‌గా పూర్తి చేయడం, వాయిస్‌ను టెక్స్ట్‌గా మార్చడం, నోట్స్‌ను క్రమబద్ధీకరించడం వంటి పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా వీడియో ఎడిటింగ్, ఆడియో జనరేషన్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి.
సెక్యూరిటీ కోసం థింక్ షీల్డ్, మోటో సెక్యూర్ ఫీచర్లతో పాటు ARM మెమరీ ట్యాగింగ్ ఎక్స్టెన్షన్ (MTE) టెక్నాలజీ అందించారు. GrapheneOS సపోర్ట్ కూడా ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ ఫోన్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో రూపొందించారు. IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ పొందింది. ఆడియో అనుభవం కోసం ప్రముఖ Bang & Olufsen సంస్థతో కలిసి ప్రత్యేక స్పీకర్ సిస్టమ్‌ను రూపొందించారు.
ఇందులో Wi-Fi 8, బ్లూటూత్ 7.0, 5G కనెక్టివిటీ, NFC, ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫాంటోనే కాల్ స్మోక్, ఫాంటోనే క్యాప్యూల్ట్ ఆలివ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మోటోరోలా సిగ్నేచర్ 27 ప్రారంభ ధరను 1,599 అమెరికన్ డాలర్లుగా (సుమారు రూ.1,51,090) ప్రకటించారు. మార్కెట్‌ను బట్టి 1,300 GBP, 1,899 EUR ధరలకు కూడా అందుబాటులోకి రానుంది. రాబోయే నెలల్లో గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేయనున్నారు. భారత్‌లో కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే భారత మార్కెట్ ధర, కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Some standards are met. Others are set.
A unique expression of design.
Introducing motorola signature 27.
Designed to a higher standard.Powered by @Snapdragon’s most advanced chipset yet, #Snapdragon 8 Elite Extreme Gen 6.
#MotorolaSignature27 #SignatureStatement
Learn more: https://t.co/US6Oyu2ZQz
— motorola (@Moto) November 5, 2026
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Today Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఏ రాశి వారికి ధనలాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!