స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
- Motorola Razr with Crystals by Swarovski పేరుతో కొత్త స్పెషల్ ఎడిషన్ ఫ్లిప్ ఫోన్..
- ఈ ఫోన్ Swarovski, Pantone భాగస్వామ్యంతో
- వెనుక భాగంలో 35 Swarovski క్రిస్టల్స్, హింజ్పై 32-ఫేసెట్ క్రిస్టల్
- ఫోన్‌కు PANTONE Meteorite డార్క్ కలర్, క్విల్టెడ్ లెదర్ టెక్స్చర్ ఫినిష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Razr Swarovski Edition Launched: మోటరోలా (Motorola) ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ సిరీస్‌లో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ (Motorola Razr with Crystals by Swarovski) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను మోటరోలా “బ్రిలియంట్ కలెక్షన్ ” లో భాగంగా లాంచ్ చేసింది. స్వరోవ్స్కీ క్రిస్టల్ తయారీ సంస్థతో పాటు పాంటోన్ సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ సాధారణ స్మార్ట్‌ఫోన్‌కు భిన్నంగా ఫ్యాషన్, లగ్జరీ డిజైన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.
స్వరోవ్స్కీ క్రిస్టల్స్:
ఈ స్పెషల్ ఎడిషన్‌లో పాంటోన్ మీటియోరైట్ (PANTONE Meteorite) అనే డార్క్ కలర్‌ను ఉపయోగించారు. ఫోన్ వెనుక భాగంలో క్విల్టెడ్, లెదర్ టెక్స్చర్తో కూడిన ఫినిష్ను అందించారు. దీనిపై సిల్వర్ నైట్ (Silver Night) కలర్లో 35 స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌ను చేతితో అమర్చారు. ఫోన్‌ను ఓపెన్, క్లోజ్ చేసే సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేలా హింజ్‌లో 32-ఫేసెట్ స్వరోవ్స్కీ క్రిస్టల్‌ను కూడా అమర్చారు. ఫోన్‌తో పాటు పారదర్శక ప్రొటెక్టివ్ కేస్‌ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా ఫోన్ డిజైన్, క్రిస్టల్స్ కనిపించేలా రక్షణ కల్పించవచ్చు.
Also Read
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
- JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
- Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
డిస్ప్లే:
ఈ ప్రత్యేక మొబైల్ 6.96 అంగుళాల FlexView FHD+ pOLED LTPO డిస్ప్లే ఉంటుంది. ఇది 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 1Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 120% DCI-P3 కలర్ గామట్, గరిష్ఠంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ బయట భాగంలో 3.63 అంగుళాల QuickView pOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1056×1066 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,700 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ బయటి డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ ఉంది.
ప్రాసెసర్ & డ్యూయల్ కెమెరా:
ఈ స్పెషల్ ఎడిషన్‌లో 4nm ఆధారిత MediaTek Dimensity 7450X ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mali-G615 MC2 GPU గ్రాఫిక్స్ పనితీరును నిర్వహిస్తుంది. ఇందులో 8GB LPDDR4X RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది f/1.7 అపెర్చర్, OISకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇందులో మాక్రో మోడ్ కూడా ఉంది. వీడియోలను గరిష్ఠంగా 4K రిజల్యూషన్‌లో 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంటుంది. ఇది f/2.4 అపెర్చర్‌తో వస్తుంది.
బ్యాటరీ:
Motorola Razrలో 4,800mAh బ్యాటరీని అందించారు. ఇది 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Dual 4G VoLTE, Wi-Fi 6E, Bluetooth 5.4, GPS, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఫోన్లో స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, USB Type-C ఆడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి. అలాగే IP48 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ధర:
ఈ స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో మోటోరోలా రేజర్ స్పెషల్ ఎడిషన్‌ను లగ్జరీ యాక్సెసరీ, ఫ్యాషన్ టెక్నాలజీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు. ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌కు నగల తరహా క్రిస్టల్ ఎలిమెంట్లను జోడించడం దీని ప్రధాన ప్రత్యేకత. ఈ ఫోన్ త్వరలో ఎంపిక చేసిన దేశాల్లో విక్రయానికి రానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో ధర, లభ్యతపై మోటరోలా నుంచి స్పష్టమైన సమాచారం వెల్లడికావాల్సి ఉంది. కచ్చితమైన ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
-
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!