Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్లో ఉన్నట్లే!
- ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్
- రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెడుతున్నారా?
- మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Charging Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరు రోజంతా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారు. కొందరి దగ్గర అయితే 2-3 స్మార్ట్ఫోన్లు కూడా ఉంటున్నాయి. ప్రతి పనికి ఫోన్ తప్పనిసరి కాబట్టి చేతిలో ఉండాల్సిందే. పగలంతా ఫోన్ వాడిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టడం చాలా మందికి ఓ అలవాటుగా మారిపోయింది. ఉదయం లేచి చూసేసరికి బ్యాటరీ 100 శాతం ఉండడంతో తెగ సంతోషపడిపోతుంటారు. అయితే ఈ అలవాటు దీర్ఘకాలంలో మీ ఫోన్ బ్యాటరీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు చాలా అడ్వాన్స్డ్ ఫీచర్లతో వస్తున్నాయి. బ్యాటరీ 100 శాతం పూర్తయ్యాక ఆటోమేటిక్‌గా ఛార్జింగ్‌ను ఆపేస్తాయి. అయినప్పటికీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. బ్యాటరీ పూర్తిగా నిండినా కూడా.. చాలా సేపు ఛార్జర్‌కు కనెక్ట్ అయి ఉండటం వల్ల లిథియం అయాన్ బ్యాటరీలపై అధిక వోల్టేజ్ స్ట్రెస్ పడుతుంది. దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువకాలం ఉండాలంటే 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్‌ను మెయింటేన్ చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ 0 శాతం వరకు ఖాళీ అయ్యేలా చేయడం లేదా ప్రతిసారీ 100 శాతం వరకు ఛార్జ్ చేయడం బ్యాటరీకి మంచిది కాదు. మధ్యస్థ ఛార్జింగ్ అలవాటు బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Also Read
- Smartphone Price Hike: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ‘షాక్’.. విపరీతంగా పెరుగుతున్న మొబైల్ ధరలు.. కారణం ఇదే!
- స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
ఇక మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు దిండ్లు, దుప్పట్లు లేదా మృదువైన ఉపరితలాలపై పెట్టడం మానుకోవాలి. ఇలా ఉంచితే ఫోన్లో ఏర్పడే వేడి బయటకు వెళ్లలేదు. ఫలితంగా బ్యాటరీ సెల్స్ వేడెక్కి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్‌కు గాలి తగిలేలా ఉండడం మంచిది. చివరగా చెప్పేదేదంటే.. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టడం ఒక్కరోజులోనే నష్టం చేయకపోయినా, దీర్ఘకాలంలో బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుంది. ఛార్జింగ్ చిట్కాలు పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!