NTV Telugu Site icon

Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు

Samsung Galaxy A16 5g

Samsung Galaxy A16 5g

శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే యూరోపియన్ వేరియంట్ Exynos 1330 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీకి సంబంధించి ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Read Also: Meta Platform: కంపెనీ తినడానికి డబ్బులిస్తే.. వైన్ గ్లాసులు కొన్నారు.. కట్‌ చేస్తే జాబ్ గోవింద?

ధర:
శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 21,999 ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను శాంసంగ్ సైట్, రిటైల్ స్టోర్‌లు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కస్టమర్‌లు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల (1080×2340 పిక్సెల్‌లు) ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-U సూపర్ AMOLED డిస్‌ప్లేను 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్షన్ 6300 6nm ప్రాసెసర్ ఉంది. గ్రాఫిక్స్ కోసం ఫోన్ Arm Mali-G57 MC2 GPUని కలిగి ఉంది. 8 GB RAMతో 128 GB స్టోరేజ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1.5 TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0ని కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఎపర్చరు F/1.8, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ఎపర్చరు F/2.2, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్‌తో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఎపర్చరు F/2.0తో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్ అంచున ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ ఉంటుంది. సైజ్ 164.4 x 77.9 x 7.9 మిమీ.. బరువు 192 గ్రాములు ఉంది. USB టైప్-సి ఆడియో ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ (IP54) రేటింగ్ ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ అందిస్తున్నారు.