Samsung Galaxy A16 5G: శాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ లాంచ్.. అదిరిపోయిన ఫీచర్లు
- శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G) ఈరోజు ఇండియాలో లాంచ్
- గత వారం యూరప్‌లో ప్రారంభం
- ఈ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే
- 50MP ప్రైమరీ కెమెరా.. 5000mAh బ్యాటరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా.. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. అయితే యూరోపియన్ వేరియంట్ Exynos 1330 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీకి సంబంధించి ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Read Also: Meta Platform: కంపెనీ తినడానికి డబ్బులిస్తే.. వైన్ గ్లాసులు కొన్నారు.. కట్ చేస్తే జాబ్ గోవింద?
Also Read
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ధర:
శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 21,999 ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను శాంసంగ్ సైట్, రిటైల్ స్టోర్‌లు.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను కస్టమర్‌లు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల (1080×2340 పిక్సెల్‌లు) ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-U సూపర్ AMOLED డిస్‌ప్లేను 90 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్షన్ 6300 6nm ప్రాసెసర్ ఉంది. గ్రాఫిక్స్ కోసం ఫోన్ Arm Mali-G57 MC2 GPUని కలిగి ఉంది. 8 GB RAMతో 128 GB స్టోరేజ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1.5 TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.0ని కలిగి ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఎపర్చరు F/1.8, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ఎపర్చరు F/2.2, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్‌తో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఎపర్చరు F/2.0తో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ అంచున ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉంటుంది. సైజ్ 164.4 x 77.9 x 7.9 మిమీ.. బరువు 192 గ్రాములు ఉంది. USB టైప్-సి ఆడియో ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ (IP54) రేటింగ్ ఇవ్వబడింది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ అందిస్తున్నారు.
- Tags
- 000 mAh Battery
- 5
- features
- india
- launch
తాజావార్తలు
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!