NTV Telugu Site icon

Meta on WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు.. మెటా రియాక్షన్‌ ఇదే..

Meta

Meta

సోషల్‌ మీడియాను షేక్‌ చేసే వాట్సాప్‌ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్‌ సేవలు ఆగిపోయాయి… యాప్‌ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్‌ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్‌లు వెళ్లినా.. డబుల్ మార్క్‌.. డబుల్ బ్లూ టిక్‌ మార్క్‌ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్‌ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు.. సర్వర్‌ స్టోరేజ్‌ కానీ, సర్వర్‌ మార్చడం కానీ, వాట్సాప్‌లో టెక్నికల్‌గా కొన్ని మార్పులు జరిగినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నమాట.. చివరకు వాట్సాప్‌ మాతృ సంస్థ అయిన మెటా దీనిపై స్పందించింది… వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంపై స్పందించిన మెటా సంస్థ.. వాట్సాప్‌ పునరుద్దరణకు ప్రయత్నిస్తున్నాం.. వీలైంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ప్రకటించింది.

Read Also: WhatsApp down: నిలిచిపోయిన వాట్సాప్‌ సేవలు…

కాగా, సోషల్‌ మీడియాలో వాట్సాప్‌కు ప్రత్యేక స్థానం ఉంది… చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే.. అందులో సోషల్‌ మీడియా యాప్స్‌ ఉండాల్సిందే.. దానినో ఫస్ట్‌ ప్రియార్టీ వాట్సాప్‌కే అనే స్థాయిలోకి అది వెళ్లిపోయింది.. ఎందుకంటే.. సందేశాలు, వీడియోలు, ఫొటోలు.. పంపించే వెసులుబాటు ఉండడమే కాదు.. ఆడియో కాలింగ్‌, వీడియో కాలింగ్‌.. గ్రూప్‌ కాలింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్‌లో ఉన్నాయి.. రోజుకో కొత్త ఫీచర్ అనే తరహాలో కొత్త కొత్త అప్‌డేట్స్‌ చేస్తూ వస్తుంది దాని మాతృ సంస్థ మెటా… ఉన్నట్టుండి ఇవాళ వాట్సాప్‌ సేవలు నిలిచిపోవడంతో.. నెటిజన్లు అల్లాడిపోతున్నారు.. ఈ సమయంలో.. మెటా ప్రకటన కొంత ఊరట కలిగిస్తూ.. ఆ సాంకేతిక సమస్యను దాటేది ఎప్పుడు..? వాట్సాప్‌ పనిచేసిది ఇంకెప్పుడు అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు వాట్సాప్‌ లవర్స్‌..

అయితే, మెటా యాజమాన్యంలోని కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ భారతదేశంలో మధ్యాహ్నం 12 గంటల నుండి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.. అప్పటి నుంచి వినియోగదారులు సందేశాలను పంపడం లేదా స్వీకరించలేకపోతున్నారు.. అయితే, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇది డౌన్ అయిందా లేదా అనేది తెలియదు. వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించే వినియోగదారులకు కూడా సేవలు నిలిపివేయబడ్డాయి. #whatsappdown అనే యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.. కొంత సమయంలోనే ఏకంగా 41,000 ట్వీట్లతో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో దూసుకొచ్చింది ఆ యాష్‌ట్యాగ్.. తాము ఎలాంటి మెసేజ్‌లను అందుకోలేకపోతున్నామని యూజర్లు రాసుకొస్తున్నారు.. ఇంతకుముందు, గ్రూప్ చాట్‌లలో సమస్య నివేదించబడింది, కానీ, తరువాత ఇతర చాట్‌లకు కూడా ఇది వ్యాపించిందంటున్నారు.. 69 శాతం మంది వినియోగదారులు తాము సందేశాలను పంపలేకపోతున్నామని వాపోతున్నారు.. దాదాపు 21 శాతం మంది సర్వర్ కనెక్షన్ల సమస్యతో సతమతమవుతున్నారని పేర్కొంటున్నారు.. అయితే, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని మాకు తెలుసు.. దీనిని వీలైనంత త్వరగా అందరికీ వాట్సాప్‌ సేవలు పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం అంటోంది మెటా సంస్థ.