Meta Layoffs: టెక్ ఇండస్ట్రీలో కొద్ది నెలలుగా ఉద్యోగుల తొలగింపులు (Layoffs) భారీగా జరుగుతుండగా, ఇప్పుడు వాలంటరీ ఎగ్జిట్స్ (Voluntary exits) లేదా స్వచ్ఛంద ఉద్యోగ విరమణలు ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) బాటలోనే తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) కూడా నడుస్తోంది. భారీ సెవరాన్స్ ప్యాకేజీతో స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలివెళ్లే ఆప్షన్‌ను తన ఉద్యోగులకు ఆఫర్ చేస్తోంది. ఫ్రెంచ్ పబ్లికేషన్ ‘లా లెట్ట్రే’ (La Lettre) రిపోర్ట్ ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని మెటా సంస్థ ఫ్రాన్స్‌లోని తన ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆప్షన్స్‌ను ఇస్తోంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో మెటాకు 300 మంది ఉద్యోగులు ఉండగా, ఈ ప్లాన్ ద్వారా సుమారు 100 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఏయే రోల్స్ లేదా డిపార్ట్‌మెంట్ల వాళ్లను ఈ ఆప్షన్ అడుగుతున్నారనేది ఇంకా స్పష్టత లేదు. అయితే మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థల్లో ఉద్యోగులు ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉండగా, మెటాలో మాత్రం ఇది ‘కలెక్టివ్ కాంట్రాక్ట్రల్ టెర్మినేషన్ ప్రొసీజర్’ (RCC) ఆధారంగా జరుగుతోంది. ఫ్రెంచ్ లేబర్ లా ప్రకారం ట్రేడ్ యూనియన్లతో చర్చించి కంపెనీ స్వచ్ఛందంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే లీగల్ మెకానిజమే ఈ ఆర్సీసీ.
ఈ ప్లాన్‌లో భాగంగా రాజీనామా చేయాలనుకునే ఉద్యోగులు నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని రిపోర్ట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 66,000 మంది ఉద్యోగులున్న మెటా.. ఈ ఆఫర్‌ను భవిష్యత్తులో వేరే దేశాలకు కూడా విస్తరిస్తుందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. గతంలో 2023లో కూడా ఫ్రాన్స్‌లో ఇలాంటి అగ్రిమెంట్‌నే మెటా కుదుర్చుకుంది. అప్పట్లో ఆ దేశంలోని 350 మంది ఉద్యోగుల్లో 88 మంది ఉద్యోగాలు వదిలేసేలా ఆ ప్లాన్ ప్లాన్ వర్కౌట్ అయింది. మెటా ఇస్తున్న భారీ సెవరాన్స్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే.. ఈ ఆర్సీసీ ప్రతిపాదన జూలై నుంచి చర్చల దశలోనే ఉంది. మెటా ప్రపోజ్ చేసిన టర్మ్స్ ప్రకారం.. ఉద్యోగం చేసిన ప్రతి సంవత్సరానికి 2.15 నెలల జీతంతో పాటు, 10 నెలల మొబిలిటీ లీవ్ (గ్రాస్ శాలరీలో 80 శాతం జీతం) ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రొఫెషనల్ రీట్రైనింగ్ (Professional retraining) లేదా సొంతంగా బిజినెస్ (Starting a business) ప్రారంభించుకోవడానికి కూడా మెటా సపోర్ట్ చేయాలని చూస్తోంది.
ఒకవేళ ఈ రిపోర్టులు కచ్చితమైనవి అయితే, ఇప్పటివరకు టెక్ ఇండస్ట్రీలో వచ్చిన అత్యంత భారీ సెవరాన్స్ ప్యాకేజీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. కాగా, ఈ వారం ప్రారంభంలో క్యాన్వా (Canva) సంస్థ కూడా తొలగించిన 1,271 మంది ఉద్యోగులకు ఫ్రీ మాక్‌బుక్స్ (Free MacBooks), లింక్డ్‌ఇన్ ప్రీమియం (LinkedIn Premium) వంటి వాటితో కూడిన భారీ ప్యాకేజీని అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మేజర్ టెక్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను రీఆర్గనైజ్ (Reorganize) చేసుకుంటూనే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో భాగంగానే గూగుల్ సంస్థ ఫ్రాన్స్‌తో పాటు ఐదు దేశాల్లో ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్లను పొడిగించింది. అలాగే మైక్రోసాఫ్ట్ కూడా అమెరికా, కెనడా, ఇండియా, యూకేలలో 60,000 మంది అర్హులైన ఉద్యోగుల కోసం బైఅవుట్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది.
ఇదిలాఉంటే మెటాలో కొద్ది రోజులుగా వరుసగా ఉద్యోగుల తగ్గింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్‌లో గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం అంటే సుమారు 8,000 పోస్టులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత మే నెలలో 7,000 మంది ఉద్యోగులను ఏఐ (AI) సంబంధిత విధుల్లోకి మార్చేశారు. గతంలో పెద్ద పెద్ద టీమ్‌లతో చేసే ప్రాజెక్ట్‌లను ఇప్పుడు ఒక్కరే చేసేలా ఏఐ టెక్నాలజీ సపోర్ట్ చేస్తోందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గతంలోనే చెప్పారు. ప్రధానంగా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Digital infrastructure), డేటా సెంటర్ల (Data centres) కోసం 2026 నాటికి మెటా సంస్థ ఏకంగా 135 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్ల వరకు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంచనా వేస్తోంది. అదే సమయంలో ‘మ్యూజ్’ (Muse) అనే పర్సనల్ ఏఐ ఏజెంట్లపై కూడా తీవ్రంగా దృష్టి పెడుతోంది.

