Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lava Bold N2 Pro Launched: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) ‘బోల్డ్’ సిరీస్ నుండి కొత్త Lava Bold N2 Proను లాంచ్ చేసింది. గత నెలలో విడుదలైన బోల్డ్ N2 కి కొనసాగింపుగా.. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కేవలం రూ. 7,999 ధరతో లభించే ఈ ఫోన్ సామాన్య వినియోగదారులకు సైతం ప్రీమియం అనుభూతిని అందించేలా ఉంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..
Also Read
- Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
డిస్ప్లే & పనితీరు:
ఈ స్మార్ట్ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్ ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చే ఈ డిస్ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో అద్భుతమైన స్మూత్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. అలాగే 4GB ఫిజికల్ ర్యామ్ తో పాటు అదనంగా మరో 4GB వర్చువల్ ర్యామ్ (RAM Expansion) సౌకర్యం ఉండటం విశేషం. ఇది ఆండ్రాయిడ్ 15 OSపై పనిచేస్తుంది.
కెమెరా & బ్యాటరీ:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్లో 50MP మెయిన్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది (బాక్స్‌లో 10W ఛార్జర్ లభిస్తుంది). దీనికి తోడు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ ఉండడంతో దుమ్ము, చినుకుల నుండి రక్షణ లభిస్తుంది.
Abandoned Baby: ముల్లపొదల్లో వదిలేసిన పసికందుకు కొత్త జీవితం!
ధర:
లావా బోల్డ్ N2 ప్రో ఎక్లిప్స్ గ్రే, ఆరోరా గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధరను రూ. 7,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్ (Flipkart)లో అందుబాటులోకి రానుంది. ఎటువంటి అదనపు యాప్స్ (Bloatware) లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయస్.
తాజావార్తలు
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..