Mogdi Honhaga: “మావోయిస్టు క్యాంపులో నన్ను శారీరకంగా వేధించారు”.. లొంగిపోయిన 19 ఏళ్ల మహిళా నక్సలైట్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mogdi Honhaga: నేడు “ఆపరేషన్ కగార్”కు చివరి రోజు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు ఇచ్చిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుల నుంచి అనేక మంది కార్యకర్తలు లొంగిపోయారు. అయితే.. తాజాగా ఒడిశా నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రూర్కెలా పోలీసుల ఎదుట సోమవారం 19 ఏళ్ల యువ మహిళా మావోయిస్టు, మోగ్దీ హోన్హాగా లొంగిపోయింది. ఇక్కడ మోగ్దీ వయసు కేవలం 19 ఏళ్లు. శరీర ఆకృతిలోనూ చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఈమె జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాకు చెందిన యువతి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)లో చురుగ్గా ఉంటూ అనేక ఆపరేషన్లలో పాల్గొందట. పశ్చిమ సింగ్‌భూమ్‌లోని మరాంగ్ పంగా గ్రామానికి చెందిన మోగ్దీ, అన్మోల్ (అలియాస్ సుశాంత్) అనే పేరుమోసిన మావోయిస్ట్ నాయకుడి ప్రభావంతో నక్సలిజం వైపు ఆకర్షితురాలైంది. అనంతరం సారండా అటవీ ప్రాంతంలో క్రియాశీలకంగా మారిందట. హోలుంఘులి గ్రామంలో కొత్త రిక్రూట్‌మెంట్లు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిందట. ఈ ఏడాది జనవరి 21న కుమ్దిహ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సమాచారం. ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లింది మోగ్దీ. ఇక సుందర్‌గఢ్ జిల్లాలోని బాంకో వద్ద ఒక రాతి క్వారీలో జరిగిన పేలుడు పదార్థాల దోపిడీలోనూ ఈ యువతి అన్మోల్‌తో కలిసి పాల్గొందట.
READ MORE: BJP: రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి, భారీగా ఉపాధి అవకాశాలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్..
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
ఇక లొంగిపోయిన తర్వాత మోగ్దీ మావోయిస్ట్ సంస్థలోని అంతర్గత వాస్తవాలను బయటపెట్టింది. ఆ గ్రూపులో తాను తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని, దీనివల్ల ఆ భావజాలంపై పూర్తిగా విరక్తి కలిగిందని వెల్లడించింది. అదే సమయంలో ఒడిశా ప్రభుత్వ లొంగిబాటు విధానం (Surrender Policy) గురించి తెలుసుకున్న మోగ్దీ, రహస్య మార్గాల ద్వారా రూర్కెలా పోలీసులను సంప్రదించి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు అందరినీ తప్పించుకుని లొంగిపోయింది. మోగ్దీ చెప్పిన విషయాలను అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం లొంగిపోయే నాటికే ఆ యువతి వయసు 19 ఏళ్లు. అంటే అడవులకు పయనమైనప్పుడు ఆమె ఓ బాలిక. మైనారిటీ సైతం తీరని వయసులో మోగ్దీపై శారీరక దాడి జరిపారంటే మావోల గురించి బయటకు తెలియని మరిన్ని విషయాలు దాడి ఉండే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?