Abandoned Baby: ముల్లపొదల్లో వదిలేసిన పసికందుకు కొత్త జీవితం!
- శ్రీకాకుళంలో హృదయ విదారక ఘటన
- శిశువును నిర్దాక్షిణ్యంగా ముల్లపొదల్లో వదిలేసిన తల్లిదండ్రులు
- అక్కున చేర్చుకున్న బూరగాం గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బూరగాం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పుట్టిన గంటల వ్యవధిలోనే ఓ మగ శిశువును కన్నవారే నిర్దాక్షిణ్యంగా ముల్లపొదల్లో వదిలేసి వెళ్లారు. ఆ అమాయక పసిబిడ్డ ఏడుపు గ్రామాన్ని కదిలించింది. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
బూరగాం గ్రామానికి చెందిన ఓ మహిళకు ముల్లపొదల వైపు నుంచి శిశువు ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. చీమలు కుడుతున్న పరిస్థితిలో, ఇంకా పుట్టిన వేడి కూడా తగ్గని పసికందు కనిపించాడు. ఆ దృశ్యం చూసి చలించిపోయిన ఆమె వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెంటనే శిశువును సమీపంలోని క్లినిక్‌కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆ పసికందు ఆరోగ్యం కుదురుకుంది.
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
అనంతరం గ్రామానికి చెందిన దేవకి కుటుంబం ఆ శిశువును చూసుకునేందుకు ముందుకొచ్చింది. కన్నవారు భారంగా భావించి వదిలేసిన ఆ పసికందుకు.. ఒక అపరిచిత మహిళ చూపిన మానవత్వం, దేవకి కుటుంబం తీసుకున్న నిర్ణయం పునర్జన్మనిచ్చినట్లయ్యింది. దేవకి కుటుంబంను అందరూ ప్రశంసిస్తున్నారు. మనుషుల్లో మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?