Site icon NTV Telugu

Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

Lava Bold N2 Pro Launched

Lava Bold N2 Pro Launched

Lava Bold N2 Pro Launched: ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) ‘బోల్డ్’ సిరీస్‌ నుండి కొత్త Lava Bold N2 Proను లాంచ్ చేసింది. గత నెలలో విడుదలైన బోల్డ్ N2 కి కొనసాగింపుగా.. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కేవలం రూ. 7,999 ధరతో లభించే ఈ ఫోన్ సామాన్య వినియోగదారులకు సైతం ప్రీమియం అనుభూతిని అందించేలా ఉంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..

Mogdi Honhaga: “మావోయిస్టు క్యాంపులో నన్ను శారీరకంగా వేధించారు”.. లొంగిపోయిన 19 ఏళ్ల మహిళా నక్సలైట్ ఆవేదన..

డిస్ప్లే & పనితీరు:
ఈ స్మార్ట్‌ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ తో వచ్చే ఈ డిస్ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో అద్భుతమైన స్మూత్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ను ఉపయోగించారు. అలాగే 4GB ఫిజికల్ ర్యామ్‌ తో పాటు అదనంగా మరో 4GB వర్చువల్ ర్యామ్ (RAM Expansion) సౌకర్యం ఉండటం విశేషం. ఇది ఆండ్రాయిడ్ 15 OSపై పనిచేస్తుంది.

కెమెరా & బ్యాటరీ:
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది (బాక్స్‌లో 10W ఛార్జర్ లభిస్తుంది). దీనికి తోడు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ ఉండడంతో దుమ్ము, చినుకుల నుండి రక్షణ లభిస్తుంది.

Abandoned Baby: ముల్లపొదల్లో వదిలేసిన పసికందుకు కొత్త జీవితం!

ధర:
లావా బోల్డ్ N2 ప్రో ఎక్లిప్స్ గ్రే, ఆరోరా గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధరను రూ. 7,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ ఫోన్ ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌ కార్ట్ (Flipkart)లో అందుబాటులోకి రానుంది. ఎటువంటి అదనపు యాప్స్ (Bloatware) లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయస్.

Exit mobile version