JioPhone 5G Launch Date and Price: రిలయన్స్‌కు చెందిన జియో ఫోన్ 5జీ గురించి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే వార్తలు వస్తున్నాయి. గూగుల్‌తో కలిసి చౌకైన 5జీ ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. అయితే ఆ ఫోన్ విడుదల తేదీని మాత్రంఇప్పటివరకు చెప్పలేదు. ఈ ఏడాది దీపావళి లేదా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశపు బడ్జెట్ 5జీ ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే బయటికి రాగా.. తాజాగా ఫొటోస్ లీక్ అయ్యాయి. ఓ టిప్‌స్టర్ కొన్ని ఫొటోలను లీక్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
JioPhone 5G Price:
జియో ఫోన్ 5జీకి సంబంధించి ఫొటోలను అర్పిత్ పటేల్ అనే యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను తెలిపాడు. జియో ఫోన్ 5జీ ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దాంతో ఇది భారతదేశంలో అత్యంత సరసమైన 5G ఫోన్ అవనుంది. ఈ ఫోన్ పలు వేరియెంట్స్ ధరలు రూ. 8 నుంచి 12 వేల మధ్య ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. దీపావళి లేదా నూతన సంవత్సరానికి ఈ ఫోన్ విడుదల చేయొచ్చని అర్పిత్ పేర్కొన్నాడు.
Also Read: Royal Enfield Classic 650 Launch: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 650 బైక్.. ధర 3 లక్షలు!
JioPhone 5G Camera:
జియో ఫోన్ 5జీ బ్యాక్కెమెరా 13 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫొటోస్ ప్రకారం ముందువైపు వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ కనిపిస్తోంది. కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ మధ్యలో జియో లోగో ఉంటుంది. లోగో కింద ‘అల్టిమేట్ స్పీడ్, అన్‌లిమిటెడ్ ఎక్స్‌పీరియన్స్’ అని రాసి ఉంది.
JioPhone 5G Battery:
జియో ఫోన్ 5జీ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. సైడ్-ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో SD కార్డ్ స్లాట్, డ్యూయల్ సిమ్ స్లాట్ ఇందులో ఉండనున్నాయి.
Also Read: Heart Health Tips: గుండె జబ్బులకు వెల్లుల్లి మంచి ఔషధం.. ఈ షాకింగ్ ప్రయోజనాలు తెలుసా?