JioHotstar: ఓటీటీ రంగంలో ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియో హాట్ స్టార్ (జిఓహాట్స్టార్) తన సబ్స్క్రిప్షన్ విధానంలో పెద్ద మార్పులు ప్రకటించింది. ఈ కొత్త మార్పులు జనవరి 28, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని సబ్స్క్రిప్షన్ లకు నెలవారీ (Monthly) ప్లాన్లను తీసుకురావడంతో పాటు.. అంతర్జాతీయ కంటెంట్ యాక్సెస్‌లోనూ కొత్త మార్పులు చేసింది. మొబైల్ యూజర్లు, పెద్ద స్క్రీన్ వీక్షకులకు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే లక్ష్యమని సంస్థ తెలియచేసింది.
ఇప్పటి వరకు క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్లకే పరిమితమైన జియో హాట్ స్టార్ ఇకపై మొబైల్, సూపర్, ప్రీమియం అన్నిటిల్లో నెలవారీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన 11 నెలల్లో కనెక్టెడ్ టీవీలు, పెద్ద స్క్రీన్లపై వీక్షణ భారీగా పెరగడం ఈ నిర్ణయానికి కారణమని సంస్థ చెప్పుకొచ్చింది. మొబైల్ యూజర్లకు తక్కువ ధరలో ప్రవేశం కల్పించడమే కాకుండా.. కుటుంబ వినియోగదారులకు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని పేర్కొంది.
CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!
కొత్త సబ్స్క్రిప్షన్ విధానంలో హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్ విషయంలో స్పష్టమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సూపర్ & ప్రీమియం ప్లాన్లలో కొత్తగా చేరే వినియోగదారులకు హాలీవుడ్ కంటెంట్ పూర్తిగా కలిపి అందించనున్నారు. అయితే మొబైల్ యూజర్లకు ఇకపై హాలీవుడ్ కంటెంట్ డిఫాల్ట్‌గా ఉండదు. మొబైల్ యూజర్లు కావాలంటే ప్రత్యేకంగా యాడ్-ఆన్ రూపంలో తీసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు వారు చూసే అలవాట్లకు అనుగుణంగా ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది.
కొత్త ధరలు ఇలా.. (కొత్త సబ్స్క్రైబర్లకు – జనవరి 28, 2026 నుంచి)
మొబైల్ ప్లాన్: నెలకు – రూ.79, 3 నెలలు – రూ.149, 1 సంవత్సరం – రూ.499
సూపర్ ప్లాన్: నెలకు రూ.149, 3 నెలలు – రూ.349, 1 సంవత్సరం – రూ.1099
ప్రీమియం ప్లాన్: నెలకు రూ.299, 3 నెలలు – రూ.699, 1 సంవత్సరం – రూ.2199
యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
ఇందులో మొబైల్ ప్లాన్ ధరల్లో మార్పు లేకపోయినా, సూపర్ వార్షిక ప్లాన్‌పై రూ.200, ప్రీమియం వార్షిక ప్లాన్‌పై రూ.700 పెంపు జరిగింది. అలాగే క్వార్టర్లీ సూపర్ ప్లాన్‌కు రూ.50, ప్రీమియం ప్లాన్‌కు రూ.200 పెరిగింది. అయితే ప్రస్తుత సబ్స్క్రైబర్లపై ఈ మార్పుల ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులు ఆటో-రిన్యువల్ కొనసాగిస్తే పాత ధరలు, పాత ప్లాన్లే అమల్లో ఉంటాయి. కొత్త ధరలు ప్రధానంగా కొత్తగా సైన్ అప్ అయ్యేవారికి మాత్రమే వర్తిస్తాయి.
జియో హాట్ స్టార్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో 1 బిలియన్ డౌన్లోడ్స్ను దాటింది. దేశవ్యాప్తంగా 450 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు, ప్లాట్ఫామ్లో 3 లక్షల గంటలకు పైగా కంటెంట్, ప్రముఖ స్పోర్ట్స్ ఐపీలు, 100కు పైగా నెట్వర్క్ ఛానళ్లు, ప్రత్యేక అనిమే హబ్, అలాగే ‘స్పార్క్స్’ ద్వారా క్రియేటర్-లెడ్ కంటెంట్ అందుబాటులో ఉంది.