iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: మిడ్ రేంజ్‌లో బ్యాటరీ, కెమెరా, పనితీరు.. ఎవరిదీ పైచేయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO Z10 Turbo+ 5G vs OPPO Reno 14 5G: రూ.30,000 ధర శ్రేణిలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నవారు లేదా అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నవారికి కెమెరా ఫీచర్లు, బ్యాటరీ, పనితీరులో మంచి ఫీచర్లున్న ఫోన్స్ కు సంబంధించి కొత్తగా రాబోతున్న iQOO Z10 Turbo+ 5G, ఇటీవలే విడుదలవుతున్న OPPO Reno 14 5G ని వినియోగదారులు పరిగణలోకి తీసుకోవచ్చు. మరి ఈ మొబైల్స్ లో ఏ మొబైల్ ఇందులో బెస్ట్..? ఏ మొబైల్ ఎందుకు కొనవచ్చు లాంటి విశేషాలను నిశితంగా చూసేద్దాం.
డిస్ప్లే:
iQOO Z10 Turbo+ 5G లో 6.78 అంగుళాల AMOLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ఉంది. అలాగే ఈ మొబైల్ HDR సపోర్ట్, 1.07 బిలియన్ కలర్స్‌తో రిచ్ విజువల్స్ అందిస్తుంది. ఇక మరోవైపు OPPO Reno 14 5G లో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మొత్తంగా iQOOలో అధిక రిఫ్రెష్ రేట్ ఉండగా, OPPOలో బ్రైట్‌నెస్, డ్యూరబిలిటీ పై ఎక్కువ ఫోకస్ ఉంది.
Also Read
- Old Smartphones: మీ ఇంట్లో ఉన్న పాత ఫోన్లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
- 9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
- WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!
- ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి

పనితీరు:
iQOO Z10 Turbo+ 5G కి 3nm టెక్నాలజీతో తయారైన MediaTek Dimensity 9400+ SoC, Immortalis-G925 GPU, 16GB LPDDR5x RAM, 512GB UFS 4.1 స్టోరేజ్ ఉంది. గేమింగ్‌లో ఇది అద్భుతమైన పనితీరును ఇస్తుంది. అలాగే OPPO Reno 14 5G లో Dimensity 8350 SoC, గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్ ఉంది. సాధారణ పనుల్లో బాగానే పనిచేసినప్పటికీ, హై-ఎండ్ గేమింగ్‌లో iQOO తో పోలిస్తే కొద్దిగా వెనుకబడి ఉంటుంది.
కెమెరా:
iQOO Z10 Turbo+ 5G లో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS తో) + 8MP అల్ట్రా వైడ్ లెన్స్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనితో 4K@30fps వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఫ్రంట్ కెమెరా 16MP ఉంది. అదే OPPO Reno 14 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3.5x ఆప్టికల్ జూమ్), 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50MP ఉండటం వలన వ్లాగింగ్, సెల్ఫీలకు ఇది అద్భుతంగా ఉంటుంది. కెమెరా వెర్సటిలిటీ పరంగా ఒప్పో ముందుంది.

బ్యాటరీ:
iQOO Z10 Turbo+ 5G కి 8,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీర్ఘకాలం ఉపయోగం, వేగవంతమైన ఛార్జింగ్ దీని ప్రత్యేకత. ఇక ఒప్పో Reno 14 5G లో 6,000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ కెపాసిటీ తక్కువైనా, ఫాస్ట్ ఛార్జింగ్ బాగా వేగంగా ఉంటుంది. మొత్తానికి బ్యాటరీ విషయంలో iQOO నే పైచేయి.
ISRO Satellite Images: ఈ ఒక్క ఫోటో చాలు.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి!

ధర:
iQOO Z10 Turbo+ 5G (12GB+256GB) ధర 2,299 CNY (రూ.28,000). హయ్యర్ వేరియంట్లు 2,499 CNY (రూ.30,500) నుంచి 2,999 CNY (రూ.36,500) వరకు ఉంటాయి. అదే ఒప్పో Reno 14 5G (8GB+256GB) ధర రూ.37,999, (12GB+256GB) ధర రూ.39,999 గా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒప్పో Reno 14 5G కాస్త ఎక్కువగానే కనపడుతుంది.

మొత్తంగా చూస్తే.. గేమింగ్, పెద్ద బ్యాటరీ కావాలనుకునే వారికి iQOO Z10 Turbo+ 5G బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే కెమెరా క్వాలిటీ, డిస్‌ప్లే డ్యూరబిలిటీ కావాలనుకునే వారికి ఒప్పో రెనో 14 5G సరైన ఎంపిక అవుతుంది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!