iQOO 15 vs OnePlus 15: కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు చాలా మంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ట్రేండింగ్ మొబైల్స్ లో ఏది బెస్ట్ మొబైల్ అని తేల్చుకొని కొనడంలో తెగ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కొనే సమయంలో ఈ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు.
ఇక ఈ మధ్యకాలంలోనే విడుదలైన iQOO 15, OnePlus 15 స్మార్ట్ఫోన్స్ రెండూ భారత్‌లో ఒకే ధరకు, చాలా దగ్గర్లోని స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ అయ్యాయి. ఈ రెండు మోడళ్లూ Snapdragon 8 Elite Gen 5, ప్రీమియమ్ AMOLED స్క్రీనులు, మంచి కెమెరాలు, పెద్ద బ్యాటరీలతో వచ్చాయి. కానీ వినియోగదారుడు ఎలాంటి అనుభవం కోరుకుంటున్నాడో దాని ఆధారంగా మొబైల్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ రెండు ఫోన్స్ లో తేడాలను చూసేద్దామా..
Akhanda : ‘అఖండ 3’ టైటిల్ లీక్.. బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
డిస్‌ప్లే:
ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకునే చాలా మంది మొదట చూసేది డిస్‌ప్లే. ఈ విభాగంలో iQOO 15 పెద్దదైన 6.85 అంగుళాల 2K Samsung M14 OLED ప్యానెల్‌తో వస్తోంది. ఇది గరిష్టంగా 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది ఇప్పటివరకు భారత మార్కెట్‌లో వచ్చిన అత్యంత ప్రకాశవంతమైన డిస్‌ప్లే. 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 2160Hz PWM డిమ్మింగ్‌తో పాటు, స్క్రీన్‌పై ఉన్న ఆంటి-రిఫ్లెక్టివ్ కోటింగ్ వల్ల నేరుగా సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ క్లారిటీ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక OnePlus 15 కొంచెం చిన్న 6.78 అంగుళాల 1.5K+ AMOLED ప్యానెల్‌ను ఉపయోగిస్తోంది. ఇది 165Hz గేమింగ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, అలాగే CoD మొబైల్ లాంటి గేమ్స్‌లో నేటివ్ 165fps గేమ్‌ప్లే అందిస్తుంది. బ్రైట్‌నెస్ విషయంలో ఈ ఫోన్ HBM 1800 నిట్స్ వరకు వెళ్తుంది. మొత్తంగా మీరు సినిమాలు, HDR కంటెంట్, అవుట్‌డోర్ విజిబిలిటీ, ఫోటో లేదా వీడియో కలర్ ఆక్యురసీని ప్రాధాన్యం ఇస్తే iQOO 15 బెస్ట్ ఛాయస్. కానీ మీ ఫోకస్ ప్యూర్ గేమింగ్ స్మూత్‌నెస్, హై FPS గేమింగ్ మీదైతే OnePlus 15 పర్ఫెక్ట్ చాయిస్.
పనితీరు & కూలింగ్:
రెండూ మొబైల్స్ కూడా అత్యాధునిక Snapdragon 8 Gen 5 ప్లాట్‌ఫారమ్, వేగవంతమైన LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో అత్యున్నత స్థాయి పనితీరును అందిస్తాయి. అయితే వీటి కూలింగ్, అదనపు ఫీచర్లలో కొన్ని తేడాలు ఉన్నాయి. iQOO 15 గేమింగ్, స్ట్రీమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినట్లు కనిపిస్తుంది. ఇందులో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ 144fps ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్, 2K వీడియో/గేమింగ్ అప్‌స్కేలింగ్, రే ట్రేసింగ్, USB 3.2 లైవ్‌స్ట్రీమ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఇక ఇది 8000mm² తో iQOO చరిత్రలోనే అతిపెద్ద వెపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. మరోవైపు OnePlus 15 దాని Cryo-వెలాసిటీ కూలింగ్ సిస్టంతో దీర్ఘకాలిక హీట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుంది. ఇది 5731mm² 3D వెపర్ ఛాంబర్, ఏరోజెల్ ఇన్సులేషన్, వైట్ గ్రాఫైట్ వంటి సాంకేతికతలను ఉపయోగించి అధిక సామర్థ్యంతో వేడిని చల్లబరుస్తుంది. కాబట్టి గేమింగ్, స్ట్రీమింగ్ కోసం iQOO 15 మెరుగ్గా అనిపించగా, దీర్ఘకాలిక ఉపయోగంలో స్థిరమైన పనితీరు, హీట్ మేనేజ్‌మెంట్ కోసం OnePlus 15 చక్కగా పనిచేస్తుంది.
కెమెరా విభాగం:
ఈ విభాగంలో రెండూ ఫోన్స్ 50MP సెన్సార్‌లను కలిగి ఉన్నప్పటికీ.. OnePlus 15 మెరుగైన కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. iQOO 15 లో 50MP Sony IMX921 మెయిన్ సెన్సార్, 150° అల్ట్రా వైడ్, 3x పెరిస్కోప్ (100x జూమ్ వరకు) ఉన్నాయి. అయితే ఇందులో HDR వీడియో సపోర్ట్ లేకపోవడం, లో-లైట్ అల్ట్రా వైడ్ పనితీరు సగటుగా ఉండటం కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఇక OnePlus 15లో 50MP Sony IMX906 మెయిన్ సెన్సార్‌తో పాటు.. 50MP అల్ట్రావైడ్ సెన్సార్, 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా OnePlus 15 లోని ‘కంప్యూటేషనల్ మ్యాజిక్’ చాలా బలంగా ఉంది. ఇది డీటెయిల్ మాక్స్ ఇంజిన్, అల్ట్రా క్లియర్ 26MP, క్లియర్ బరస్ట్ 10fps, క్లియర్ నైట్ ఇంజిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది డాల్బీ విజన్ 4K @ 120fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది iQOO 15లో లేని HDR వీడియో లోపాన్ని అధిగమిస్తుంది. కాబట్టి వీడియోలు, రాత్రి ఫోటోలు, పోర్ట్రెయిట్‌లు మొత్తం కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీలో OnePlus 15 స్పష్టమైన విజేత.
Best Mileage Bikes: బడ్జెట్ రేంజ్‌లో ఉత్తమ మైలేజీనిచ్చే టాప్ 5 బైక్‌లు ఇవే..!
డిజైన్ & డ్యూరబిలిటీ:
ఈ రెండు మొబైల్స్ మధ్య డిజైన్, మన్నిక (డ్యూరబిలిటీ) విషయంలో స్పష్టమైన భేదం ఉంది. iQOO 15 గ్లాస్, ఫైబర్ బ్యాక్ ఆప్షన్లతో పాటు.. 220 గ్రాముల బరువును కలిగి ఉండి, ప్రత్యేకంగా Monster Halo LED నోటిఫికేషన్ రింగ్‌తో ఒక కొత్త స్టైల్‌ను కలిగి ఉంది. ఇది IP68 + IP69 వాటర్/డస్ట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అంతేకాక వెట్-ఫింగర్ టచ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇక మరోవైపు OnePlus 15 ఇన్ఫినిటీ బ్లాక్, సాండ్ స్టోర్మ్, అల్ట్రా వయొలెట్ వంటి రంగులలో ఫ్రాస్టెడ్ గ్లాస్ లేదా ఫైబర్ బాడీతో ప్రీమియమ్ రూపాన్ని అందిస్తుంది. డ్యూరబిలిటీ విషయంలో, OnePlus 15 IP66, IP68, IP69 లతోపాటు అధిక ఒత్తిడి వాటర్ జెట్‌లకు కూడా నిరోధకతను అందించే IP69K రేటింగ్‌తో మరింత మెరుగైన రక్షణను అందిస్తుంది.
బ్యాటరీ & ఛార్జింగ్ :
బ్యాటరీ విషయానికి వస్తే.. OnePlus 15 స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తుంది. ఇది iQOO 15 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్ కంటే మెరుగ్గా.. 7300mAh సిలికాన్ నానో స్టాక్ బ్యాటరీ, వేగవంతమైన 120W వైర్డ్ ఛార్జింగ్ ఇంకా 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను అందిస్తుంది. అంతేకాక, OnePlus 15 నాలుగు సంవత్సరాల తర్వాత కూడా 80% బ్యాటరీ హెల్త్ ఉంటుందని హామీ ఇవ్వడం ద్వారా OnePlus దీర్ఘకాలిక బ్యాటరీ స్థిరత్వంలో విజేతగా నిలుస్తుంది.
ఎవరికి ఏ ఫోన్ బెస్ట్?
ఈ రెండు మొబైల్స్ తమ ప్రత్యేక లక్షణాల ఆధారంగా వేర్వేరు వినియోగదారుల అవసరాలను తీరుస్తాయి. మీరు ఎక్కువగా గేమింగ్, అవుట్‌డోర్ వినియోగం కోసం చూస్తున్నట్లయితే, iQOO 15 ఉత్తమ ఎంపిక. దీని అత్యుత్తమ 6000 నిట్స్ బ్రైట్‌నెస్, Q3 చిప్, 144fps ఫ్రేమ్ ఇంటర్‌పొలేషన్ గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీరు కెమెరా, వీడియో, బ్యాటరీ సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తే.. OnePlus 15 స్పష్టమైన విజేతగా నిలుస్తుంది.
