Site icon NTV Telugu

యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?

Iqoo 15 Ultra

Iqoo 15 Ultra

iQOO 15 Ultra: గత ఏడాది విడుదలైన iQOO 15కు తోడుగా ఇప్పుడు కంపెనీ మరిన్ని ఫీచర్స్ తో ఐక్వూ 15 అల్ట్రా (iQOO 15 Ultra)ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ కానుందని iQOO అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. మొబైల్ సంబంధించి ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణ ఫ్లాగ్‌షిప్ అప్‌గ్రేడ్ కాకుండా.. హార్డ్‌కోర్ గేమర్లను లక్ష్యంగా చేసుకున్న పెర్ఫార్మెన్స్-ఫోకస్‌డ్ మోడల్ గా ఐక్వూ రూపొందిస్తోంది.

Lava Blaze Duo 3 Launch: డ్యూయల్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. అతి తక్కువ ధరలో టాప్ ఫీచర్స్!

ఐక్వూ 15 అల్ట్రా మొబైల్ ప్రత్యేకమైన గేమింగ్ డిజైన్‌తో కనిపిస్తోంది. వెనుక భాగంలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, చుట్టూ రింగ్ డిజైన్, అలాగే బాడీ అంతటా ఆరెంజ్ యాక్సెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ ఫోన్‌లో ప్రధాన హైలైట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్. ఫోన్ దిగువ భాగంలో అమర్చిన ఈ ఫ్యాన్, ఎక్కువ సమయం ఆడే గేమింగ్ వాళ్ళ వచ్చే హీట్‌ను తగ్గించి స్టేబుల్ ఫ్రేమ్‌రేట్స్, నిరంతర పనితీరు అందించేందుకు ఉపయోగపడుతుంది. కూలింగ్ ఫ్యాన్ కోసం కంపెనీ ఐదేళ్ల వరకు ప్రత్యేక ప్రొటెక్షన్ ప్లాన్ ను కూడా అందిస్తున్నట్లు సమాచారం.

ఇందుల Qualcomm Snapdragon 8 Elite Gen 5 SoC ప్రాసెసర్ ఉండనుందని అంచనా. ఇది హెవీ గేమ్స్, మల్టీటాస్కింగ్‌లో అత్యుత్తమ పనితీరును అందించనుంది. 165Hz హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెరుగైన టచ్ రెస్పాన్స్, థర్మల్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టితో ఈ ఫోన్‌ను రూపొందించారు. దీంతో ఇది సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు కాకుండా.. డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలవనుంది. ఫోటోగ్రఫీ విషయంలో వెనుక భాగంలో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనుందని సమాచారం. ఇది లాంగ్-రేంజ్ జూమ్ ఫోటోగ్రఫీకి ఉపయోగపడనుంది.

7.2mm స్లిమ్ డిజైన్‌, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..?

లేటెస్ట్ లీకుల ప్రకారం.. ఇందులో 7,000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందనుంది. చైనా 3C సర్టిఫికేషన్‌లో ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కనిపించింది. అయితే భవిష్యత్తులో 200W ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా అందించే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version