Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- ఇన్స్టాగ్రామ్ మ్యూజ్ ఆప్షన్..
- మెటా తీసుకొచ్చిన పర్సనల్ ఏఐ ఏజెంట్
- చాట్‌బాట్‌లా సమాధానాలు ఇవ్వడంతో పాటు పనులను ప్లాన్ చేయడంలో సహాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram MUSE: ఇన్స్టాగ్రామ్ యూజర్లలలో చాలామందికి షేర్ మెనూలో మ్యూజ్ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనపడుతోంది. మొదట చూస్తే ఇది పోస్టులు లేదా రీల్స్‌ను షేర్ చేసేందుకు సంబంధించిన ఫీచర్లా అనిపించినా.. కానీ ఇది మెటా (Meta) కొత్తగా తీసుకొచ్చిన Muse AI ఏజెంట్. సాధారణ చాట్‌బాట్‌లా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం, నిర్వహించుకోవడంలో యూజర్లకు సాయం చేయడమే దీని ఉద్దేశం.
MUSE అంటే ఏమిటి?
కొంతమంది ఇంస్టాగ్రామ్ యూజర్ల షేర్ మెనూలో మ్యూజ్ (MUSE) అనే కొత్త ఆప్షన్ కనిపించవచ్చు. దానిపై ట్యాప్ చేస్తే “మ్యూజ్ ఫ్రమ్ మెటా” యాప్ లిస్టింగ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మ్యూజ్ ను “Your personal AI agent”గా పరిచయం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ ఒకే విధంగా అందుబాటులో లేదు. కొన్ని ప్రాంతాల్లో యాప్ లిస్టింగ్ కనిపిస్తుండగా.. మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అందుబాటులో లేదనే సమాచారం కనిపిస్తోంది. అంటే అన్ని దేశాల ఇంస్టాగ్రామ్ యూజర్లకు ఒకేసారి MUSE యాక్సెస్ లభించడం లేదు. భారతదేశంలో కూడా దీని యాక్సెస్ ఇంకా లభించలేదు.
Also Read
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ఈ కొత్త ఫీచర్ ను ఒక పనికి సంబంధించిన పలు దశలను అర్థం చేసుకుని వాటిని ప్లాన్ చేసుకునేలా రూపొందించారు. ఉదాహరణకు టికెట్ల ధరలను గమనించడం, సరైన సమయంలో రిజర్వేషన్ చేసుకోవడంలో ఇది సాయం చేయగలదు. అలాగే ఈమెయిల్లో ఏదైనా ఫారం వస్తే దాన్ని పూర్తి చేయడంలో, తదుపరి ప్రక్రియను అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. అవసరమైన పనులకు రిమైండర్లను సెట్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది.
అంతేకాదు దీనిని ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కొన్ని పనుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. యూజర్ ఖర్చులను పరిశీలించి, ఎక్కడ సేవింగ్స్ చేసే అవకాశం ఉందో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు ఒకేసారి అనేక పెయిడ్ సబ్స్క్రిప్షన్లు కొనసాగుతున్నట్లయితే.. వాటిలో ఏవైనా అవసరం లేకపోతే గుర్తించడంలో ఇది సాయం చేయగలదు. అయితే ఏదైనా చెల్లింపు లేదా ఖర్చుకు తుది అనుమతి ఇచ్చే నిర్ణయం మాత్రం యూజర్ చేతిలోనే ఉంటుంది.
రోజువారీ పనులతో పాటు పెద్ద లక్ష్యాలను కూడా దీని ద్వారా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో డిన్నర్ రిజర్వేషన్స్, మారథాన్ ప్రెప్, సేవ్ ఫర్ న్యూ కార్ వంటివి కనపడుతాయి. అంటే యూజర్ తన లక్ష్యాన్ని చెబితే, దాన్ని సాధించడానికి అవసరమైన పనులను దశలవారీగా ప్లాన్ చేసుకోవడంలో AI సహాయపడుతుంది.
అనేక యాప్స్‌తో కనెక్ట్
మ్యూజ్ ను వివిధ యాప్స్, సర్వీసులతో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో జిమెయిల్, గూగుల్ క్యాలెండర్, హెల్త్, పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, పెలోటోన్, ఫైనాన్స్ వంటి కనెక్షన్లు ఉన్నాయి. వీటి సర్వీసులను కనెక్ట్ చేసిన తర్వాత యూజర్‌కు సంబంధించిన వివిధ పనుల సమాచారంతో పనిచేయగలదు. అయితే ఏ కనెక్షన్ లేదా ఫీచర్ అందుబాటులో ఉంటుంది అనేది యూజర్ ఉన్న ప్రాంతం, సేవల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!