Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Reels on TV: ఇన్నాళ్లూ ఫోన్ స్క్రీన్‌కే పరిమితమైన ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు నేరుగా మీ ఇంట్లోని పెద్ద టీవీ స్క్రీన్‌పైకి వచ్చేసింది. మెటా సంస్థ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా ‘యాపిల్ టీవీ’ (Apple TV) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై రీల్స్, లాంగ్ వీడియోలు, లైవ్ షోలను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి హాయిగా టీవీలోనే రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ చూడొచ్చు. అక్టోబర్ 23 నుంచి ఈ యాప్ యాపిల్ టీవీ యాప్ స్టోర్‌లో ఉచితంగా లభిస్తోంది. భారత్‌లోని యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రావడం విశేషం.
సాధారణంగా ఇన్స్టాగ్రామ్ అంటే స్మార్ట్‌ఫోన్‌లో ఒక్కరమే స్క్రోల్ చేస్తూ చూసే వ్యక్తిగత అనుభూతి. కానీ, దాన్ని అందరూ కలసి చూసే ఓ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అనుభవంగా మార్చడమే మెటా లక్ష్యం. గతంలో స్మార్ట్ టీవీల్లో చేసిన కొన్ని ప్రయోగాల్లో కేవలం రీల్స్ మాత్రమే లూప్‌లో వచ్చేవి. కానీ, ఈ కొత్త యాపిల్ టీవీ వెర్షన్లో రీల్స్‌తో పాటు సుదీర్ఘమైన క్రియేటర్ వీడియోలు, లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లు కూడా చూడొచ్చు. ఇందులో ఉన్న మరొక పెద్ద ప్లస్ పాయింట్ ‘క్రాస్ డివైజ్ కంటిన్యూటీ’. అంటే, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్లో ఏదైనా పెద్ద వీడియో సగం చూసి ఆపేస్తే, ఇంటికి వచ్చాక మిగతా భాగాన్ని టీవీలోనే ఎక్కడిదాకా చూశారో అక్కడి నుంచే కంటిన్యూ చేయవచ్చు.
Also Read
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
- 200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
- Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 లాంచ్.. 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్‌తో అద్భుతమైన ఫీచర్స్!
దీని కోసం కొత్తగా మార్కెట్లోకి వచ్చే యాపిల్ టీవీ బాక్స్‌ను కొనాల్సిన అవసరం లేదు. యాపిల్ సంస్థ ఇటీవల కొత్తగా నాలుగో జనరేషన్ యాపిల్ టీవీ 4 కే ప్రకటించినప్పటికీ (ఇది నవంబర్ 13 నుంచి విక్రయానికి రానుంది), మీ దగ్గర ఉన్న పాత యాపిల్ టీవీ హెచ్డీ లేదా యాపిల్ టీవీ 4 కే పరికరాల్లోనే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. కాకపోతే, మీ డివైజ్ ‘tvOS 26.0’ లేదా అంతకంటే కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్‌పై రన్ అవుతుందో లేదో చూసుకోవాలి.
ఇక, స్మార్ట్ టీవీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ కొన్నాళ్లుగా గట్టిగానే ప్రయత్నిస్తోంది. నిజానికి, ఈ బిగ్ స్క్రీన్ ప్రయోగం డిసెంబర్ 2025లో అమెజాన్ ఫైర్ టీవీతో మొదలైంది. ఆ తర్వాత ఫిబ్రవరి 2026లో గూగుల్ టీవీకి, జూన్ 2026లో శామ్సంగ్ స్మార్ట్ టీవీలకు విస్తరించింది. అంతకంటే ముందు సెప్టెంబర్ 2025లో ఐప్యాడ్ కోసం ప్రత్యేక ఇన్స్టాగ్రామ్ యాప్‌ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వరుసలోనే యాపిల్ టీవీకి కూడా ఈ సదుపాయం వచ్చింది. మీ యాపిల్ టీవీలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులభం. టీవీ ఆన్ చేసి, సిస్టమ్ సాఫ్ట్వేర్ tvOS 26కి అప్డేట్ అయిందో లేదో చూసుకోండి. ఆ తర్వాత యాప్ స్టోర్‌లోకి వెళ్లి ‘Instagram’ అని సెర్చ్ చేసి, ఉచితంగా యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. స్క్రీన్ పై కనిపించే సూచనలు పాటిస్తూ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌తో లాగిన్ అయితే సరిపోతుంది.
తాజావార్తలు
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
ట్రెండింగ్
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!