Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Engineer Suicide: రాజధానిలోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి విషయమై ప్రియుడికి వీడియో కాల్ చేసి, బెదిరిస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ (29) హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో ఉన్న ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమె మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో నివాసముంటోంది. కాగా, ఆదివారం అర్ధరాత్రి ఆమె తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
Also Read
- Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
- 200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
- Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రియుడు:
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అర్చన ప్రియుడు భండారి విమల్ పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో అర్చన తనకు వీడియో కాల్ చేసింది. ఆ సమయంలో తాను తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు చేర్యాలకు వెళ్తున్నానని విమల్ తెలిపాడు. వీడియో కాల్లో అర్చన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు కట్టిన చున్నీని చూపిస్తూ.. ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడే ఉరి వేసుకుంటా’ అని బెదిరించిందని పేర్కొన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆమె కాల్ కట్ చేసిందని, ఆందోళనతో తాను వెంటనే తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదని వివరించాడు.
తలుపులు బద్దలుకొట్టిన పోలీసులు:
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విమల్ వెంటనే అక్కడి నుంచి బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో చంద్రనాయక్ తండాలోని అర్చన ఇంటికి చేరుకున్నాడు. లోపలి నుంచి తలుపు గడియ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా స్పందన రాలేదు. దీంతో వెంటనే విమల్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అర్చన అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది.
విడాకుల అంశంపై ఆరా:
అర్చనతో ఉన్న వివాహేతర/ప్రేమ సంబంధం నేపథ్యంలో భండారి విమల్ ఇప్పటికే తన భార్యతో విడాకులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో పెళ్లి కోసం అర్చన ఒత్తిడి తీసుకురావడమే ఆత్మహత్యకు కారణమా? లేక వీరిద్దరి మధ్య మరేవైనా ఆర్థిక లేదా ఇతర విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, విమల్ ఫోన్ కాల్ డేటా, వీడియో కాల్ రికార్డులను పరిశీలిస్తూ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!