Infinix Note 60: ఇటీవల ఇన్ఫినిక్స్ సంస్థ CES 2026లో తమ కొత్త Infinix Note 60 సిరీస్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో శాటిలైట్ కాలింగ్, మెసేజింగ్ ఫీచర్ ఉండనుంది అని కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా Infinix Note 60 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు Google Play Console లిస్టింగ్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Read Also: MSVG : ‘మన శంకరవరప్రసాద్‌గారు’ క్లైమాక్స్ లీక్.. చిరు–వెంకీల ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
Android 16తో Infinix Note 60
* Infinix Note 60 స్మార్ట్‌ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. ఇది తాజా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
MediaTek Dimensity ప్రాసెసర్
* ఈ ఫోన్‌లో MediaTek MT6878 కోడ్ నేమ్‌తో కూడిన ప్రాసెసర్ ఉండనుంది.
* 2.5GHz వేగంతో పనిచేసే 4 Cortex-A78 కోర్లు
* 2.0GHz వేగంతో పనిచేసే 4 Cortex-A55 కోర్లు ఉన్నాయని వెల్లడించింది. ఈ ప్రాసెసర్ వాస్తవానికి MediaTek Dimensity 7300 కావచ్చని టాక్.
Read Also: Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
డిస్‌ప్లే & డిజైన్ వివరాలు
* Infinix Note 60లో
* 1208 x 2644 పిక్సెల్స్ రిజల్యూషన్
* 520ppi పిక్సెల్ డెన్సిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ డిజైన్‌ను పరిశీలిస్తే పంచ్-హోల్ కెమెరా కనిపిస్తోంది. ఫోన్ కుడి వైపున వాల్యూమ్ బటన్లు, పవర్ బటన్ ఉండగా, ఎడమ వైపున ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ బటన్ (యాక్షన్ బటన్) ఉండే అవకాశం ఉందని రూమర్స్ ఉన్నాయి.
RAM
* ఈ ఫోన్ 8GB RAMతో లాంచ్ అయ్యే అవకాశం
ఇండోనేషియా SDPPI సర్టిఫికేషన్లో Infinix Note 60 సిరీస్‌లోని మరిన్ని మోడల్స్
* Infinix Note 60 – X6879
* Infinix Note 60 Edge – X6887
* Infinix Note 60 Pro – X6878.. మోడల్స్‌ను కంపెనీ విడుదల చేయనుంది. అదనంగా, Pininfarina డిజైన్‌తో రూపొందించిన Infinix Note 60 Ultra కూడా త్వరలో లాంచ్ కానుందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. కాగా, Infinix Note 60 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.