స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువైపోయింది. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ ను యూజ్ చేస్తున్నారు. మ్యూజిక్ వినడానికి, కాల్స్ మాట్లాడడానికి ఇయర్ బడ్స్ నే ఉపయోగిస్తున్నారు. జర్నీ చేసే సమయాల్లో, డ్రైవింగ్ చేసేటపుడు బ్లూటూత్ ఉపయోగకరంగా మారింది. మార్కెట్ లో అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందుబాటులో ఉంటున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఇయర్ బడ్స్ ను తీసుకొస్తున్నాయి. చౌక ధరలో బెస్ట్ ఇయర్ బడ్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రియల్ మీ బ్రాండ్ కు చెందిన realme Buds T110 పై బంపరాఫర్ అందుబాటులో ఉంది.
ఏకంగా 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో రూ. 3 వేలు విలువ చేసే ఇయర్ బడ్స్ కేవలం రూ. 1499కే వచ్చేస్తున్నాయి. వీటిలోని ప్రత్యేకత ఏంటంటే ఏఐ ఆధారిత ENC నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ తో బయట నుంచి ఎన్ని శబ్ధాలు వచ్చినా క్వాలిటీ వాయిస్ వినొచ్చు. ఈ ఇయర్ బడ్స్ లో సౌండ్ కోసం 10 10mm డైనమిక్ బాస్ డ్రైవర్ ఉంటుంది. బ్లూటూత్ 5.4, AAC సపోర్ట్, 2500IUC చిప్ అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే బడ్స్ 40mAh ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ 460mAh పవర్ కేస్‌తో వస్తాయి. 10 నిమిషాల ఛార్జింగ్ తో 2 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్ అందిస్తోంది.
ఈ ఇయర్ బడ్స్ మొత్తం 38 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. స్మార్ట్ టచ్ కంట్రోల్ ఆప్షన్ ను అందించారు. ఇవి IPX5 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తున్నాయి. తేలిక పాటి వర్షంలో, వ్యాయామం చేసే సమయాల్లో కూడా యూజ్ చేయొచ్చు. బడ్స్ 88ms లేటెన్సీతో సూపర్ లేటెన్సీ గేమింగ్ మోడ్ ను కలిగి ఉన్నాయి. ఆడియో కోసం బడ్స్ లో 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, పీక్ +టీపీయు డోమ్ టాప్ టైటానియం కోటెడ్ కాంపోజిట్ డయాఫ్రాగమ్ అందించారు. 4.09g బరువును మాత్రమే కలిగి ఉండడంతో చెవిలో ఎక్కువ టైమ్ ఉంచడానికి వీలుగా ఉంటుంది. మరి మీరు బెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కావాలనుకుంటే రియల్ మీ ఇయర్ బడ్స్ పై ఓ లుక్కేయండి.