Site icon NTV Telugu

Honor X7c 5G: IP64 రేటింగ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో కొత్త హానర్ స్మార్ట్ ఫోన్ లాంచ్!

Honor X7c 5g

Honor X7c 5g

Honor X7c 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ భారత మార్కెట్లో తన కొత్త Honor X7c 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ద్వారా మాత్రమే విక్రయించబడే ఈ మొబైల్ పై కంపెనీ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. Honor X7c 5G మొబైల్ అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు.

అయితే, ఆగస్టు 20న ప్రత్యేక ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ రూ.14,999 ధరలో లభ్యం కానుంది. ఈ మొబైల్ కేవలం 8GB RAM + 256GB స్టోరేజ్ ఒకే వేరియంట్ మాత్రమే అందించబడుతోంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు నో-కాస్ట్ EMI (6 నెలల వరకు) ఆప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, మూన్ లైట్ వైట్ రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Redmi 15 5G: నేడు భారత మార్కెట్లో విడుదల కానున్న రెడ్మీ 15.. ధర, ఫీచర్లు ఇవే..!

Honor X7c 5G మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా MagicOS 8.0 తో నడుస్తుంది. ఇందులో 6.8 అంగుళాల FHD+ TFT LCD డిస్‌ప్లే (2,412×1,080 పిక్సెల్స్) 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 850 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తుంది. ఫోన్‌ను 4nm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ను ఉపయోగించారు. దీనికి Adreno 613 GPU కూడా తోడవుతుంది. ఇక మెమరీ పరంగా, ఇది 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో పాటు 300 శాతం హై-వాల్యూమ్ మోడ్ ఉంటుంది. ఇది అవుట్‌డోర్ వినియోగంలో మెరుగైన సౌండ్‌ను అందించనుందని కంపెనీ చెబుతోంది.

ఇక కెమెరా విభాగంలో, Honor X7c 5Gలో 50MP f/1.8 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది LED ఫ్లాష్ కూడా అమర్చబడింది. ఈ మొబైల్ లోని కెమెరాలు Portrait, Night, Aperture, PRO, Watermark, HDR వంటి మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం 5MP f/2.2 ఫ్రంట్ కెమెరా హోల్-పంచ్ కటౌట్‌లో ఇవ్వబడింది.

Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !

ఈ కొత్త ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ అమర్చబడి ఉంది. ఇది 35W SuperCharge వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ప్రకారం ఈ బ్యాటరీతో 24 గంటల ఆన్‌లైన్ స్ట్రీమింగ్, 18 గంటల షార్ట్ వీడియో ప్లేబ్యాక్, 59 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 46 గంటల కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. అంతేకాకుండా Ultra Power-Saving Mode ద్వారా కేవలం 2% బ్యాటరీతో కూడా 75 నిమిషాల వాయిస్ కాల్ చేయవచ్చు.

ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. Honor X7c 5Gకి IP64 రేటింగ్ ఉంది. ఇది డస్ట్, స్ప్లాష్ ప్రూఫ్ కేటగిరీలో వస్తుంది. కనెక్టివిటీ కోసం డ్యుయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0, GPS, AGPS, GLONASS, BeiDou, Galileo సపోర్ట్ లభిస్తుంది. మొత్తానికి బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, 5G సపోర్ట్, తక్కువ ధరలో Honor X7c 5G మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకోబోతుంది.

Exit mobile version