Site icon NTV Telugu

మ్యాట్ ఫినిష్ బ్యాక్‌, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d బడ్జెట్ 5G ఫోన్ లాంచ్!

Honor X6d

Honor X6d

Honor X6d 5G: హానర్ కంపెనీ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ లైనప్‌ ను పెంచుతూ Honor X6dను యూఏఈలో లాంచ్ చేసింది. గత ఏడాది చైనాలో విడుదలైన Honor Play 60A మోడల్‌కు దగ్గరగా ఉండే స్పెసిఫికేషన్లతో ఈ కొత్త ఫోన్ వచ్చింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.

ఈ Honor X6dలో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌ను 6nm MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ నడిపిస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 256GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9 ఉన్నాయి. స్టోరేజ్‌ను పెంచే అవకాశం గురించి కంపెనీ వివరాలు వెల్లడించలేదు.

Viral News : భద్రాచలంలో ‘బాలభీముడు’.. 5.2 కేజీల బరువుతో శిశువు జననం..

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరా (f/2.0 అపర్చర్), 1080p వీడియో రికార్డింగ్ (30fps), 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2) సాధారణ వినియోగానికి సరిపడే కెమెరా సెటప్‌ను అందించారు. ఇంకా ఇందులో 5,260mAh బ్యాటరీ ఉంది. Wi-Fi, బ్లూటూత్ వంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.

డిజైన్ పరంగా ఫోన్‌లో ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, వెనుకభాగంలో స్క్వేర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ సైడ్స్, పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉండగా.. మ్యాట్ ఫినిష్ బ్యాక్‌పై గ్లోసీ కెమెరా మాడ్యూల్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది.

రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..

యూఏఈలో 4GB + 256GB వేరియంట్ ధర AED 509 (సుమారు రూ.12,600)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతం మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ సియన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో ఈ ఫోన్ విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Exit mobile version