200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!

Honor Robot Phone

Honor Robot Phone

HONOR Robot Phone: హానర్ (HONOR) నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone)ను ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. లాంచ్‌కు ముందే ఇప్పటికే అన్ని ఛానళ్లలో కలిపి 2 లక్షలకు పైగా ప్రీ-ఆర్డర్లు నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి ఈ ఫోన్‌పై ఎంత భారీ అంచనాలు ఉన్నాయో అర్థమవుతుంది. ఈ ఫోన్‌తో కేవలం హార్డ్‌వేర్‌పైనే కాకుండా AI ఆధారిత ఇమేజింగ్, ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఫోన్ లాంచ్ కానుంది.

HONOR AiMAGE టెక్నాలజీ:

ఈ ఫోన్‌లో హానర్ కొత్తగా అభివృద్ధి చేసిన AiMAGE Architectureను అందిస్తోంది. ఇది మూడు స్థాయిల్లో పనిచేస్తుంది. అవేంటంటే..
* చిప్ లెవెల్ (Chip Level): AI ఆధారిత కొత్త Image Signal Processor (ISP), మెరుగైన పిక్సెల్ సెన్సింగ్ టెక్నాలజీ.
* డివైస్ లెవెల్ (Device Level): టైటానియం అల్లాయ్ 3-యాక్సిస్ గింబల్, రియల్‌టైమ్ AI స్టెబిలైజేషన్.
* క్లౌడ్ లెవెల్ (Cloud Level): RAW ఇమేజ్ ప్రాసెసింగ్, AI ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్, క్లౌడ్ ఆధారిత ఫోటో ఎడిటింగ్.

గింబల్ టెక్నాలజీ:

హానర్ ఈ ఫోన్‌లో పరిశ్రమలోనే అత్యంత చిన్న 4DoF గింబల్ (Gimbal) సిస్టంను అమర్చారు. ఇందుకోసం సాధారణ మోటార్లతో పోలిస్తే 70% చిన్న మైక్రో మోటార్ ను ప్రత్యేకంగా రూపొందించింది. అలాగే 2800MPa బలం కలిగిన హై-పర్ఫార్మెన్స్ మెటీరియల్‌తో ఫోన్ బాడీని తయారు చేసింది.

ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్స్:

HONOR Robot Phoneలో 6.3 నుంచి 6.4 అంగుళాల పరిమాణంలో 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. నాలుగు వైపులా సమానమైన బెజెల్స్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. పనితీరు కోసం Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే HONOR స్వయంగా అభివృద్ధి చేసిన Yuguang H1 Image Processing చిప్ ఈ ఫోన్‌లో తొలిసారిగా అందుబాటులోకి రానుంది. AI ఫీచర్ల పరంగా YOYO On-Device AI మోడల్ ను అందిస్తున్నారు.

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌:

ఫోటోగ్రఫీ కోసం HONOR Robot Phoneలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇందులో 1/1.28-అంగుళాల CMOS సెన్సార్, f/1.6 అపర్చర్, 23mm ఫోకల్ లెంగ్త్‌తో ఉన్న 200MP గింబల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి తోడు 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, అధిక ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ కోసం ప్రముఖ సినిమా కెమెరా తయారీ సంస్థ ARRI టెక్నాలజీని ఇందులో సమీకరించారు. ARRI Log-C3 Encoding సపోర్ట్‌తో పాటు ప్రొఫెషనల్ సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ అనుభవాన్ని ఈ ఫోన్ అందించనుంది. ప్రొఫెషనల్ సినిమా కెమెరాల తయారీ సంస్థ ARRIతో HONOR భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్‌లో తొలిసారిగా ARRI Log-C3 Encodingకు సపోర్ట్ ఇవ్వనుంది.

లాంచ్ ఎప్పుడు.?

ఆగస్టు 12న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నారు. అదే రోజు ధర, స్టోరేజ్ వేరియంట్లు, గ్లోబల్ లాంచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. AI ఇమేజింగ్, 200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా ఫీచర్లతో ఈ ఫోన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశముంది.