Google Pixel 10a: గూగుల్ నుంచి త్వరలోనే కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 10a మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధిలో ఉన్నప్పటికీ దీని గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా లాంచ్ టైమ్‌లైన్, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లు, స్పెసిఫికేషన్లపై ఆసక్తికర సమాచారం లీక్ అయింది. Pixel 10a ఫిబ్రవరి మధ్య నాటికి స్టోర్లలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గత ఏడాది మార్చి 2025లో లాంచ్ అయిన Pixel 9aతో పోలిస్తే, ఈసారి దాదాపు నెల ముందుగానే గూగుల్ తన కొత్త మోడల్‌ను రిలీజ్ చేయనుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Anasuya Bharadwaj: ప్రెస్ మీట్లో అనసూయ కన్నీళ్లు.. నేను బాగానే ఉన్నా, లేకపోయినా..!
లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజ్ వివరాలు
Pixel 10a ఫిబ్రవరి మధ్య నాటికి స్టోర్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గత ఏడాది మార్చి 2025లో లాంచ్ అయిన Pixel 9a కంటే దాదాపు నెల ముందే విడుదల కానుంది.
* 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు..
* Obsidian, Berry, Fog, Lavender అనే నాలుగు కలర్ ఆప్షన్లు..
* Pixel 9a మాదిరిగానే Iris, Peony, Porcelain, Obsidian రంగుల్లో విడుదలైంది.
Read Also: Tamannaah : తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ వార్నింగ్..
స్పెసిఫికేషన్స్
* 6.3 అంగుళాల Full HD+ AMOLED డిస్ప్లే
* 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
* 60Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్
* డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* 48MP ప్రైమరీ కెమెరా
* 13MP అల్ట్రా వైడ్ కెమెరా
* ఫ్రంట్ కెమెరా: 13MP
* 8GB RAM
* 5,100mAh బ్యాటరీతో పాటు ఈ ఫోన్ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన Tensor G4 చిప్సెట్తో పనిచేసే అవకాశం ఉంది.
సాఫ్ట్వేర్ అప్డేట్స్, ధర..
గూగుల్ Pixel 10aకి ఏడేళ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు అందించనున్నట్లు సమాచారం. ఇది గూగుల్ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అలాగే, 128GB వేరియంట్ ధర సుమారు $499 (రూ.44,000 వరకు) ఉండొచ్చని అంచనా.