Google Pixel 10 Pro Fold: గూగుల్ తన కొత్త తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold) ను అధికారికంగా గ్లోబల్‌గా లాంచ్ చేసింది. మల్టీటాస్కింగ్, వినోదం కోసం మరింత అనుభూతి కలిగించేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో పెద్ద స్క్రీన్, మెరుగైన పనితీరు, బలమైన డ్యూరబిలిటీతో పాటు IP68 సర్టిఫికేషన్ (డస్ట్, వాటర్ రెసిస్టెన్స్) కూడా అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ, ఛార్జింగ్ ఆప్షన్లు కూడా గత మోడళ్ల కంటే మెరుగయ్యాయి. మరి ఆ వివరాలేంటో పూర్తిగా చూసేద్దాం..
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్స్:
పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ లో 6.4 అంగుళాల OLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్) ఇవ్వబడింది. ఇది 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. లోపలి స్క్రీన్‌గా 8 అంగుళాల LTPO OLED డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్) అమర్చారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ప్రాసెసర్ :
ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ డివైస్ టెన్సర్ G5 చిప్సెట్, టైటాన్ M2 చిప్ పై పనిచేస్తుంది. అలాగే బ్యాటరీగా 5,015 mAh సామర్థ్యం కలిగి ఉంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తుంది. ఇక స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసినట్లయితే.. మెమరీ వేరియంట్స్‌గా గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఆప్షన్లు (ప్రాంతాల వారీగా) అందుబాటులో ఉంటాయి.
కెమెరా ఫీచర్లు:
కెమెరా విభాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 48MP వైడ్ లెన్స్, 10.5MP అల్ట్రావైడ్ (మాక్రో ఫోకస్‌తో), 10.8MP 5x టెలిఫోటో లెన్స్ ఉండి ఇది 20x సూపర్ రెజల్యూషన్ జూమ్, ఆప్టికల్ క్వాలిటీ జూమ్ (0.5x, 1x, 5x, 10x) సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరాగా 10MP డ్యుయల్ కెమెరాలను పొందుపరిచారు.

Off The Record: టీడీపీ నేతలే కూన రవి కుమార్ కుర్చీ కింద మంటలు పెడుతున్నారా..?
డిజైన్, సాఫ్ట్వేర్:
ఈ ఫోన్ ఎరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, మల్టీ అల్లాయ్ స్టీల్ హింజ్ తో బలంగా డిజైన్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుంది. గూగుల్ 7 సంవత్సరాల పాటు OS, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్డేట్స్ అందిస్తామని హామీ అందిస్తామని అంది.

ధర, లభ్యత:
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ ధర రూ.1,72,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూన్‌స్టోన్ కలర్ వేరియంట్లో అందుబాటులోకి వస్తుంది. భారత్‌లో ఇది గూగుల్ స్టోర్ ద్వారా విక్రయించబడుతుంది.