చలికాలం వచ్చేసింది.. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. చలి నుంచి బయట పడేందుకు చలి మంటో లేకపోతే స్వేటర్లు వేసుకుంటారు. మరికొందరు రకరకాల జాకెట్లు వేసుకుని చలిని అరికట్టేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని ప్రాంతాల్లో భరించలేనంత చలి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని కంపెనీలు హీట్ జాకెట్లు లేదా ఎలక్ట్రిక్ జాకెట్లను తీసుకొచ్చాయి. చలిని నియంత్రించే లక్షణం దీనికి ఉంటుంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ జాకెట్‌లో 5 హీటింగ్ జోన్‌లు ఉన్నాయి అంటే ఈ జాకెట్ మీకు ఐదు వేర్వేరు ప్రదేశాల నుండి వెచ్చని ఫీల్ ను ఆస్వాదించవచ్చు..
ఆన్లైన్లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.. కొన్ని ఈకామర్స్ సంస్థలు కూడా వీటిని విక్రయిస్తున్నాయి.. సరైన క్వాలిటీ చూసి కొనుగోలు చేస్తే మంచిది. కొన్ని కంపెనీలు చెప్పినట్లుగా, ఈ ఎలక్ట్రిక్ జాకెట్లు సాధారణంగా 5 తాపన మండలాలను కలిగి ఉంటాయి.. ఈ జాకెట్లు మీకు వేడిని పుట్టిస్తాయి.. బయట పెరుగుతున్న చలి తీవ్రతను తగ్గిస్తుంది.. అంతేకాదు బాడికి ఎంత వేడి కావాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చునని చెబుతున్నారు..
ఈ ఎలక్ట్రిక్ జాకెట్లు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. సరసమైన ధర నుండి ఖరీదైన ధరల వరకు మార్కెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ ధరలు జాకెట్ ఫీచర్లపై ఆధారపడి ఉంటాయి.. వీటిని మామూలు వాటిలాగా నీటితో ఉతకవచ్చు అని చెబుతున్నారు.. ఇక ధర విషయానికొస్తే.. నాణ్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి, అదేవిధంగా, ఈ ఎలక్ట్రిక్ జాకెట్ల ధరలు కూడా 10 వేల రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు ప్రారంభమవుతాయి… ఆ జాకెట్ల గురించి వివరంగా తెలుసుకున్నాకే కొనడం మంచిది.