NTV Telugu Site icon

Crowdstrike: కస్టమర్లను బుజ్జగించేందుకు క్రౌడ్‌స్ట్రైక్ యత్నం..గిఫ్ట్ కార్డుల అందజేత

Crowdstrike

Crowdstrike

మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్‌స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్‌స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దానికి క్రౌడ్‌స్ట్రైక్ ప్రధాన కారణం.. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఒక లోపం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కంప్యూటర్‌లను ప్రభావితం చేసింది. భారతదేశం, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్, యుకే ఇతర దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటి సిస్టమ్‌లలో సాంకేతిక సేవలపై పెద్ద సైబర్ అంతరాయం ఏర్పడింది. సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా దేశంలోని విమానయాన సంస్థలు, బ్యాంకులు, సూపర్ మార్కెట్‌ల సేవలు అడపాదడపా నడిచాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి. న్యూస్ రీడర్ ప్రసారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ తీవ్రమైన పొరపాటుకు కంపెనీ క్షమాపణలు కూడా చెప్పింది.

READ MORE: Blackmail : భర్త సుఖం కోసం తన స్నేహితురాలి గంజాయి అలవాటు.. మత్తులో భర్తతో రేప్‌

ఈ సాంకేతిక లోపం వల్ల ప్రభావితమైన వినియోగదారులకు కంపెనీ తాజాగా శుభవార్త చెప్పింది. వినియోగదారులకు $10 విలువైన ( రూ. 837 ) ఉబర్ ఈట్స్ (Uber Eats) బహుమతి కార్డ్‌ను అందించింది. భారతీయ రూపాయలలో ఈ బహుమతి విలువ సుమారుగా రూ. 837 ఉంటుంది. ఈ చర్యతో ప్రభావితమైన వినియోగదారుల కోపాన్ని తగ్గించడానికి కంపెనీ ఈ విధమైన బహుమతి ప్రకటించింది. కానీ ఈ భారీ తప్పిదానికి పాల్పడిన కంపెనీ కస్టమర్లను బుజ్జగించేందుకు ఈ బహుమతి సరిపోదని పలువురు భావిస్తున్నారు.