Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Smartphones: 2026 నాటికి భారత మొబైల్ మార్కెట్ గణనీయంగా మార్పు చెందింది. గతంలో 5G సేవలు కేవలం ఖరీదైన ఫోన్లకే పరిమితం కాగా.. ఇప్పుడు రూ. 10,000 లోపు ధరలోనే అత్యుత్తమ ఫీచర్లతో కూడిన 5G ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వేగవంతమైన ఇంటర్నెట్, మెరుగైన ప్రాసెసర్లు, నాణ్యమైన కెమెరాలతో ఈ బడ్జెట్ ఫోన్లు సామాన్యులకు సైతం అత్యాధునిక సాంకేతికతను చేరువ చేస్తున్నాయి. ప్రస్తుత 2026 టెక్నాలజీ కాలంలో బడ్జెట్ ధరలో 5G స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఎందరో.. అలాంటి వారి కోసం రూ. 10,000 లోపు లభిస్తున్న బెస్ట్ మొబైల్స్ వివరాలను ఇక్కడ చూద్దాం.
Cooking Oil Prices: సామాన్య ప్రజలకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు
Also Read
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
- స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
- Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ M16 5G (Samsung Galaxy M16 5G)
తక్కువ ధరలో నమ్మకమైన బ్రాండ్, నాణ్యత కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. ఇందులో డిస్ప్లే 6.5-అంగుళాల FHD+ LCD స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇక ప్రాసెసర్ ఎక్సినోస్ 1330 చిప్సెట్ మెరుగైన పనితీరును అందిస్తుంది. వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఇది 6000mAh భారీ బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
రెడ్మి 14 5G (Redmi 14 5G)
షావోమీ నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఫోన్ డిజైన్, పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్. ఇందులో డిస్ప్లే 6.7 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉంది. ఇది గేమింగ్, వీడియోలకు బాగుంటుంది. దీనికి స్నాప్‌డ్రాగన్ 4 Gen 3 ప్రాసెసర్ ఉండటం వల్ల మల్టీ-టాస్కింగ్ సులభమవుతుంది. అలాగే ఇది 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, క్లియర్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
మోటోరోలా మోటో G25 5G (Motorola Moto G25 5G):
క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం కావాలనుకునే వారికి మోటోరోలా బెస్ట్ ఛాయిస్. ఇందులో 6.6 అంగుళాల డిస్ప్లేతో పాటు స్టీరియో స్పీకర్ల సదుపాయం ఉంది. ఇంకా ఇందులో 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరా టెక్నాలజీతో తక్కువ వెలుతురులోనూ మంచి ఫోటోలు తీయవచ్చు. ఇది వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌తో వస్తుంది, ఇది చిన్నపాటి నీటి తుంపర్ల నుండి రక్షణ ఇస్తుంది.
రియల్‌మి C67 5G (Realme C67 5G):
స్టైలిష్ లుక్, వేగవంతమైన ఛార్జింగ్ కోరుకునే యువతకు ఈ ఫోన్ బాగా సరిపోతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్తో అద్భుతమైన 5G కనెక్టివిటీని కలిగి ఉంది. దీనికి వేగవంతమైన 33W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను అందిస్తోంది. ఇది చాలా సన్నగా (Slim), ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంకా ఇందులో 50MP AI కెమెరాతో వైవిధ్యమైన ఫోటోగ్రఫీ మోడ్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!