సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Watch Series 12 launched: యాపిల్ తన నెక్స్ట్-జనరేషన్ స్మార్ట్‌వాచ్ Apple Watch Series 12ను లాంచ్ చేసింది. అమెరికాలోని యాపిల్ పార్క్ క్యాంపస్ వేదికగా నిర్వహించిన ‘సర్ప్రైజ్ అండ్ షైన్’ ఈవెంట్లో దీన్ని విడుదల చేశారు. ఈ వాచ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో కంటే ప్రత్యేకంగా ఉండనుంది. హెల్త్ ట్రాకింగ్, ఫిట్నెస్ విశ్లేషణలు, ఏఐ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టి ఈ వాచ్‌ను రూపొందించారు. కొత్త S11 చిప్సెట్, watchOS 27 సాఫ్ట్‌వేర్‌తో ఇది మరింత వేగవంతంగా పనిచేస్తుంది.
ధర, రంగుల వివరాలు..
భారత్‌లో యాపిల్ వాచ్ సిరీస్ 12 (Apple Watch Series 12) ప్రారంభ ధర రూ. 56,900గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రి-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమవ్వగా, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇది 42mm, 46mm సైజుల్లో అల్యూమినియం, టైటానియం, సిరామిక్ ఆప్షన్లలో లభిస్తుంది. అల్యూమినియంలో డార్క్ బ్రాంజ్, బ్లాక్, లైట్ గోల్డ్, స్పేస్ గ్రే రంగులు ఉండగా.. టైటానియంలో రేడియంట్ గోల్డ్, నేచురల్ టైటానియం షేడ్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
- iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
- iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
- Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
హెల్త్ డేటా..
ఈ వాచ్‌లో అందించిన కొత్త హెల్త్ సెన్సింగ్ సిస్టమ్ (Health Sensing System) అతిపెద్ద అప్‌గ్రేడ్‌గా నిలుస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన ఆప్టికల్, ఎలక్ట్రికల్ హార్ట్ సెన్సార్లు S11 చిప్‌తో కలిసి రోజంతా ప్రతి 5 సెకన్లకు ఒకసారి గుండె వేగాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తాయి. అంతేకాకుండా, ‘హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV)’ని మునుపటి కంటే 24 రెట్లు ఎక్కువ తరచుగా రికార్డ్ చేస్తూ వ్యక్తిగత హెల్త్ బేస్‌లైన్‌ను విశ్లేషిస్తుంది. ఫిట్నెస్ ప్రియుల కోసం ఇందులో కొత్తగా Readiness ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇది ఇటీవలి శారీరక శ్రమ, ట్రైనింగ్ లోడ్, నిద్ర, ఇతర హెల్త్ డేటాను విశ్లేషించి 0 నుంచి 10 వరకు ఒక స్కోర్‌ను ఇస్తుంది. ఈ స్కోర్‌ను బట్టి ఆ రోజు వర్కవుట్స్ ఎంత తీవ్రంగా చేయాలో (Recover, Pace Yourself, Ready లేదా Go For It) సూచనలు అందిస్తుంది. రీడిజైన్ చేసిన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా స్టెప్ ట్రాకింగ్ అక్యురసీ మరింత పెరిగింది.
ప్రత్యేకంగా నిలవనున్న Siri Recap..
S11 చిప్ ఆధారంగా పనిచేసే వాయిస్ ఇంటెలిజెన్స్ (Audio Intelligence) ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాటల్లోని చివరి 15 సెకన్ల సంభాషణను టెక్స్ట్ రూపంలో చూపే ‘Live Rewind’, సంభాషణల ముఖ్య విషయాలను టెక్స్ట్ సమరీగా ఇచ్చే ‘Siri Recap’, ‘Sound Recognition’ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఏవీ ఆడియో రికార్డింగ్‌లను స్టోర్ చేయకుండా ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. watchOS 27లో భాగమైన సిరి AI వినియోగదారుల పర్సనల్ కాంటెక్స్ట్ను సులభంగా అర్థం చేసుకుంటుంది.
బ్యాటరీ లైఫ్..
ఈ వాచ్ సాధారణ వినియోగంలో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. అలాగే అవుట్డోర్ వర్కవుట్స్ సమయంలో 10 గంటల వరకు నిరంతర పర్యవేక్షణ (continuous trackin) అందిస్తుంది. వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 12 గంటల అదనపు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.
తాజావార్తలు
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త, లేదంటే భారీ మూల్యం తప్పదు!
-
Explainer: హైదరాబాద్‌లో బతకలేమా? ప్రపంచంలోనే చివరి నుంచి రెండో స్థానం..
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!