iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
- iPhone 18 Pro లాంచ్ ఎఫెక్ట్
- iPhone 17, Air, 17e ధరలు భారీగా పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iPhone Price Hike: Apple కొత్తగా iPhone 18 Pro, iPhone 18 Pro Max, iPhone Duo మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన వెంటనే పాత iPhone మోడళ్ల ధరలను పెంచింది. గతేడాది విడుదలైన iPhone 17, అలాగే iPhone Air, ఈ ఏడాది మార్చిలో వచ్చిన iPhone 17e ధరలను కంపెనీ పెంచింది. కొన్ని మోడళ్లపై ధరల పెంపు భారీగా ఉండటంతో పాత ఐఫోన్ కొనాలని భావిస్తున్న వినియోగదారులకు ఇది షాకింగ్ న్యూస్‌గా మారింది. అంతేకాదు, కొత్త ఐఫోన్ల విడుదల నేపథ్యంలో iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడళ్లను Apple తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది.
iPhone 17 ధర ఎంత పెరిగింది?
Apple iPhone 17ను గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో రూ.82,900 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. తాజా ధరల పెంపుతో 256GB మోడల్ ధర రూ.99,900కి చేరింది. అంటే ప్రారంభ ధరతో పోలిస్తే రూ.17,000 పెరిగింది.
Also Read
- Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
iPhone 17 వేరియంట్ లాంచ్ ధర. కొత్త ధర
256GB రూ.82,900 – రూ.99,900
512GB రూ.99,900 – రూ.1,24,900
iPhone Air ధర భారీగా పెంపు
Apple తీసుకొచ్చిన అత్యంత పలుచని ఐఫోన్‌గా చెప్పబడుతున్న iPhone Air ధర కూడా భారీగా పెరిగింది. భారత్‌లో ఈ ఫోన్‌ను గతేడాది రూ.1,19,900 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ.1,49,900కి చేరింది. iPhone Airలో 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ధరల పెంపు తర్వాత కొత్త ధరలు ఇలా ఉన్నాయి:
iPhone Air వేరియంట్ లాంచ్ ధర. కొత్త ధర
256GB రూ.1,19,900 రూ.1,49,900
512GB రూ.1,39,900 రూ.1,74,900
1TB రూ.1,59,900 రూ.2,24,900
iPhone 17e ధర కూడా పెరిగింది
Apple ఈ ఏడాది మార్చిలో iPhone 17eని భారత్‌లో విడుదల చేసింది. ఈ మోడల్‌ను సరసమైన ధరలో ఐఫోన్ అనుభవాన్ని అందించే డివైస్‌గా కంపెనీ తీసుకొచ్చింది. లాంచ్ సమయంలో iPhone 17e ప్రారంభ ధర రూ.64,900గా ఉంది. ఇప్పుడు Apple దీని ధరను రూ.20,000 పెంచి రూ.84,900 చేసింది. అంటే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఈ ఐఫోన్ ధరలో భారీ మార్పు వచ్చింది.
iPhone 17 Pro, Pro Max అధికారిక స్టోర్ నుంచి తొలగింపు
కొత్త iPhone 18 Pro సిరీస్ లాంచ్ నేపథ్యంలో Apple మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత తరం iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడళ్లను Apple తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. సాధారణంగా కొత్త తరం Pro మోడళ్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత Apple పాత Pro మోడళ్లను తన అధికారిక విక్రయాల నుంచి తొలగిస్తుంది. అయితే ఇతర రిటైల్ ప్లాట్‌ఫారమ్‌లలో స్టాక్ అందుబాటులో ఉంటే ఈ మోడళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉండొచ్చు.
కొత్త ఐఫోన్ కొనేవారికి ఇది షాకింగ్ న్యూస్!
సాధారణంగా కొత్త iPhone సిరీస్ వచ్చిన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని వినియోగదారులు భావిస్తుంటారు. కానీ Apple తాజా నిర్ణయం దీనికి భిన్నంగా ఉంది. కొత్త తరం iPhoneలు మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొన్ని పాత మోడళ్ల ధరలు పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ముఖ్యంగా iPhone Air 1TB వేరియంట్‌పై రూ.65,000 వరకు ధర పెరగడం గమనార్హం.
తాజావార్తలు
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!