సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్.. బెంగళూరులో Anthropic AI ఫస్ట్ ఆఫీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic AI: ఐటీ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన అంథ్రోపిక్ ఏఐ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇండియాలో తొలి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఏఐ రాకతో భారత్‌లో బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి పెద్ద అడుగు మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు టోక్యోలో ఓ కార్యాలయం ఉంది. అయితే.. భారత్‌లో ఏర్పాటు చేయబోయే కార్యాలయం ఆసియాలో రెండోది. ఈ ఆఫీస్‌ను తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న బెంగళూరులో స్టార్ట్ చేయనున్నారు. అలాగే కంపెనీలు, భాషాశాస్త్రం, లాభాపేక్షలేని సంస్థలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతటా తమ శ్రేణిని ప్రకటించింది.
READ MORE: ISIS Uranium Plan: 1,000 టన్నుల యురేనియం కోసం ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ ప్లాన్!
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఈ అంశంపై ఆంథ్రోపిక్ ఏఐ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ మాట్లాడుతూ.. ఈ ఏఐ ప్రయోజనాలు పెద్ద కంపెనీలకే కాకుండా సాధారణ ప్రజలకు సైతం అందేలా చేయాలన్న లక్ష్యంతో ఈ విస్తరణ జరుగుతోందని తెలిపారు. ఈ కార్యాలయంతో పాటు అనేక భారతీయ సంస్థలతో భాగస్వామ్యాలు సైతం ప్రకటించారు. ఎయిర్ ఇండియాతో కలిసి కస్టమ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయడానికి డెవలపర్లకు సహాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థ CRED Claude Codeను ఉపయోగించి ఫీచర్లను రెట్టింపు వేగంతో అందిస్తోందని తెలిపారు. ఐటీ దిగ్గజం Cognizant పాత సిస్టమ్‌లను ఆధునీకరించడానికి, కొత్త సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని వేగవంతం చేయడానికి Claudeను ఉపయోగిస్తోంది. స్టార్టప్‌లైన Razorpay, Emergent కూడా ఈ సంస్థ కస్టమర్లలో ఉన్నాయి. భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా పనిచేయడం కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన అంశం. Karya, Collective Intelligence Projectలతో కలిసి వ్యవసాయం, న్యాయ రంగాల్లో పనిచేసే స్థానిక భాషల వినియోగదారులకు ఉపయోగపడే ఏఐ మోడళ్లను రూపొందిస్తున్నారు. దీనికి Digital Green, Adalat AI వంటి సంస్థల నిపుణులు సహకరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలను అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
READ MORE: Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..
ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ రాకతో ఈ భయాలు మరింత పెరిగాయి. ఇటీవల ఆంథ్రోపిక్ సీఈవో దారియో అమోడీ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వెన్నులో వణుకుపుట్టించాయి. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం ఎంట్ర లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని సీఈవో ప్రకటించారు. ఇదే కాకుండా వచ్చే 6 నుంచి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పూర్తిగా రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ రావచ్చని హెచ్చరించారు. ఈ హెచ్చరికల తర్వాత వచ్చిన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సైతం ఇదే తరహా డేటాను ప్రదర్శించింది. డిసెంబర్ 2025లో ఉద్యోగావకాశాలు 6.54 మిలియన్లకు పడిపోయాయని చెప్పింది. సెప్టెంబర్ 2020 తర్వాత ఇదే అత్యల్పం అని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..