Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- ఎయిర్టెల్ ఉచిత అంతర్జాతీయ రోమింగ్
- పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ఏడాదికి ఒక అంతర్జాతీయ రోమింగ్ ట్రిప్ ఉచితం
- ఉచిత రోమింగ్ ప్యాక్‌లో 5జీబీ మొబైల్ డేటా
- 60 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ ఉచితం
- 25 అవుట్గోయింగ్ ఎస్ఎంఎస్లు, ఇన్కమింగ్ ఎస్ఎంఎస్లకు ఉచితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Free International Roaming: విదేశాలకు వెళ్లే ఎయిర్ టెల్ (Airtel) పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు టెలికాం సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఏడాదికి ఒక అంతర్జాతీయ రోమింగ్ ట్రిప్‌ను ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో భాగంగా ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒకసారి ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. వ్యక్తిగత పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లతో పాటు ఫ్యామిలీ ప్లాన్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్లాన్‌లోని ప్రతి సభ్యుడికి ప్రత్యేకంగా ఈ ప్రయోజనం లభిస్తుంది.
ఈ ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లో భాగంగా 5GB మొబైల్ డేటా, 60 నిమిషాల కాలింగ్, 25 అవుట్గోయింగ్ SMSలు, ఇన్కమింగ్ SMSలకు ఉచిత సదుపాయం లభిస్తాయి. ఈ ప్రయోజనాల వ్యాలిడిటీ 5 రోజులుగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యాక్టివేట్ చేసిన వెంటనే రోమింగ్ ప్యాక్ వ్యాలిడిటీ ప్రారంభం కాదు. విదేశాలకు వెళ్లినప్పుడు అవసరమైన సమయంలోనే ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Flipkart BBD: 6000 mAh బ్యాటరీ.. ఏఐ+ బ్రాండ్‌లో 5 స్మార్ట్ ఫోన్స్.. భారీ డిస్కౌంట్లు..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
ఎయిర్ టెల్ వ్యక్తిగత వినియోగదారుల కోసం రూ.499 నెలవారీ ప్లాన్ నుంచి కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఫ్యామిలీ ప్లాన్లలో రూ.749 ప్లాన్‌లో రెండు సిమ్‌లు, రూ.1,049 ప్లాన్‌లో మూడు సిమ్‌లు, రూ.1,249 ప్లాన్‌లో నాలుగు సిమ్‌లు ఉంటాయి. అలాగే నాలుగు సిమ్ల కోసం రూ.1,449 ప్లాన్, ఐదు సిమ్ల కోసం రూ.1,799 ప్లాన్ కూడా ఉన్నాయి. ఈ ఆరు ప్లాన్లలోనూ ప్రతి సిమ్‌కు ఏడాదికి ఒక ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్ ట్రిప్ లభిస్తుంది.
రోమింగ్ ప్రయోజనంతో పాటు.. కొన్ని ప్లాన్లలో అన్లిమిటెడ్ డేటా, కాలింగ్‌తో పాటు స్పామ్, మోసాల నుంచి రక్షణ కల్పించే ఫీచర్లను కూడా అందిస్తోంది. అయితే ప్లాన్‌ను బట్టి అదనపు సబ్స్క్రిప్షన్లు మారుతాయి.
రూ.499 ప్లాన్‌లో Xstream ప్లే ప్రీమియం, గూగుల్ వన్ వంటి సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. అధిక ధర కలిగిన ఫ్యామిలీ ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్, జియో హాట్ స్టార్, ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ iCloud+, నెట్ఫ్లిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఇప్పటికే ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ సేవలను ఉపయోగిస్తున్న కస్టమర్లు కొత్త ప్లాన్లకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం Airtel యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్ టెల్ స్టోర్‌ను సందర్శించి కొత్త ప్లాన్‌కు మారవచ్చు. మరోవైపు వోడాఫోన్ ఐడియా (Vi) కూడా ఇటీవల ఇంటర్నేషనల్ రోమింగ్‌పై ఇలాంటి ప్రయోజనాన్ని ప్రకటించింది. Vi ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్లలో ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్‌ను అందిస్తోంది. Vi ప్రకారం 170కి పైగా దేశాల్లో ఈ ప్రయోజనం లభిస్తుండగా.. ప్లాన్‌ను బట్టి ఏడాదికి మూడు అంతర్జాతీయ ట్రిప్‌ల వరకు పొందే అవకాశం ఉంది. Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.501 నుంచి ప్రారంభమవుతున్నాయి.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!