NTV Telugu Site icon

Realme P1 Speed 5G: రియల్ మీ నుంచి 5G స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ధర ఇవే..!

Realme

Realme

రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ ​​5G (Realme P1 Speed ​​5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం…

Aloe vera-Curd: కలబందను పెరుగులో కలిపి రాసుకోండి.. ఈ మార్పులు గ్యారెంటీ..!

Realme P1 స్పీడ్ 5G ధర:
రియల్ మీ P1 స్పీడ్ యొక్క 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 17,999 రూపాయలు ఉంది. 12 GB RAM మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 20,999కి విడుదల చేశారు. రూ. 2000 పరిమిత కూపన్ తగ్గింపుతో కస్టమర్లు 8 GB, 12 GB RAM వేరియంట్‌లను పొందవచ్చు. దీంతో.. ధర రూ. 15,999, రూ. 18,999తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు హ్యాండ్‌సెట్ బ్రష్డ్ బ్లూ, టెక్చర్డ్ టైటానియం కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ అక్టోబర్ 20 అర్ధరాత్రి 12 గంటలకు రియల్ మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభంకానున్నాయి. మరోవైపు.. Realme Techlife Studio H1 ధర రూ.4,999గా ఉంది. తగ్గింపుతో.. ఈ హెడ్‌సెట్‌ను రూ. 4,499కి కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్:
రియల్ మీ P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత రియల్ మీ UI 5.0 తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 8 GB RAM, 128 GB స్టోరేజ్.. 12 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 Hz, గరిష్ట ప్రకాశం 2000 నిట్‌లు.. డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌ని ఈ ఫోన్‌లో అందించారు. డైనమిక్‌ర్యామ్ ఫీచర్ ద్వారా హ్యాండ్‌సెట్‌లోని ర్యామ్‌ను 26GB వరకు విస్తరించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో హీట్ మేనేజ్‌మెంట్ కోసం స్టీల్ VC కూలింగ్ సిస్టమ్ అందిస్తున్నారు. అలాగే.. 50 మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరా ఉంది. అంతే కాకుండా.. సెల్ఫీ, వీడియో చాట్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ఛార్జింగ్ కోసం .. 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000mAh బ్యాటరీ అందిస్తున్నారు. ఈ ఫోన్ సౌజ్ 161.7×74.7×7.6mm, బరువు 185 గ్రాములు. కనెక్టివిటీ కోసం.. 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, USB టైప్-C పోర్ట్ వంటివి కలిగి ఉంది. అంతేకాకుండా.. యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్ మరియు లైట్ సెన్సార్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP65 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది.