రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.