Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology 5 Smartphones Under Rs 30000 Launching This Month In India

Smart Phones: స్మార్ట్​ఫోన్ల హవా.. అదిరే ఫీచర్లతో కొత్త మోడళ్లు

Published Date :June 8, 2022 , 1:00 pm
By Mahesh Jakki
Smart Phones: స్మార్ట్​ఫోన్ల హవా.. అదిరే ఫీచర్లతో కొత్త మోడళ్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ నెలలో అదిరిపోయే ఫీచర్లతో చాలా స్మార్ట్‌ఫోన్లు ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో జూన్ 1న రూ.30 వేల సెగ్మెంట్‌లో ఐకూ నుంచి నియో 6 లాంచ్ అయింది. అయితే ఈ నెలలో ఇండియన్ మార్కెట్‌లో రూ.30 వేల లోపు ధరలతో మరో5 ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటి ఫీచర్లు, ధరలు ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ ఈ నెలలోనే “వన్‌ప్లస్ 10ఆర్ లైట్” 5జీని భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇదే ఫోన్ చైనాలో కొద్ది రోజుల క్రితం వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌గా లాంచ్ అయింది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100-మ్యాక్స్‌ ప్రాసెసర్, 8జీబీ /12జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్‌ అందించారు. దీని ధర దాదాపు రూ.23,000 ఉంటుందని అంచనా.

“వివో టీ2ఎక్స్” స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఈ నెలలో విడుదల కానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్ అందించారు. కెమెరాల విషయానికొస్తే…. టీ2ఎక్స్‌లో వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను వాటర్‌డ్రాప్ కటౌట్‌లో అందించారు. ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర దాదాపు రూ.20,000 ఉండవచ్చని అంచనా.

GDP Forecast: భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంక్

“రియల్‌మీ జీటీ నియో 3టీ”ని మంగళవారం భారత్‌లో రిలీజ్ చేశారు. రియల్‌మీ జీటీ నియో 3టీలో 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీటీ నియో 3టీ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో రన్ అవుతుంది. వెనుక వైపు 64 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో షూటర్‌ అందించారు. ముందు భాగంలో ఫోన్‌లో 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.29,999గా ఉండవచ్చు.

రెడ్‌మీ నుంచి “రెడ్‌మీ 11 5జీ” ఇండియాలో జూన్ నెలలో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌లో ఏ50 ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, 2 ఎంపీ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.14,000గా ఉండే అవకాశం ఉంది.

“ఒప్పో రెనో 8 లైట్ 5జీ” ఇప్పటికే స్పెయిన్‌లో లాంచ్ అయ్యింది. ఈ నెలలో ఇండియాలో లాంచ్ కానుంది. ఇందులో 6.43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 1 టీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ ఆప్షన్ అందించారు. వెనుకవైపు 64ఎంపీ ప్రైమరీ వైడ్ లెన్స్, రెండు 2ఎంపీ కెమెరాలు ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫోన్ ధర దాదాపు రూ.25,000 ఉండే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gadgets
  • mobile phones
  • smart phones
  • Smartphone Launches in June
  • tech world

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions