మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో 46 ఏళ్ల డాక్టర్, ఆయన టీనేజ్ కుమార్తెకు జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బుధవారం ఒక అధికారి తెలిపారు. ఆ వైద్యుడికి ఇటీవల జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.