Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది.