Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.