Zaheer Khan on Team India Batting: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని.. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు…