మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. ‘చిజారసీ టోల్‌ప్లాజా వద్ద నా కారుపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ముగ్గురు, నలుగురు దుండగులు కాల్పులు జరిపి, ఆయుధాలు వదిలేసి పరారయ్యారు. కారు…