India vs Pakistan: సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై ఆడాడు. ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ పై శివతాండమే చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనస్, షోయబ్ అక్తర్ వంటి బౌలర్లను చీల్చి చెండాడాడు