Pakistan: ఆపరేషన్ సింధూర్‌తో పాక్ పీచమనిచినా దాయాది బుద్ధి మాత్రం మారడం లేదు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో వైమానిక దళం లష్కరే తోయిబా (LET) ప్రధాన కార్యాలయం మర్కజ్ తైబాపై బాంబులతో విరుచుకుపడింది. ఈ ఉగ్రకేంద్రం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిడ్కేలో ఉంది. భారత్ దాడిలో లష్కరే కమాండ్ సెంటర్, కేడర్ వసతి, ఆయుధాల నిల్వ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన ఉమ్-ఉల్-ఖురా బ్లాక్‌లు ఖతం అయ్యాయి. READ ALSO: Weather Update…