ఓ సినిమా హిట్‌గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పు లేదు కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పొగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిలైనవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డీమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి మిగిలినవన్నీ జెండ్ బామ్ రాసుకునే ఫిల్మ్స్‌గా మారాయి. Also…
సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తుంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్‌ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడెన్లీ కథలోకి ఎంటరై నెక్ట్స్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్న కంగువాలో, నాని హిట్3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్‌ను నడిపించే రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. కంగువా2, హిట్ 4కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం Also Read : NANI :…