వైఎస్ఆర్ టీపీ షర్మిల పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం పై షర్మిల విషం కక్కుతోందని మండిపడ్డారు. సంస్కార హీనంగా మాట్లాడితే ఏమైనా జరగొచ్చని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పిచ్చిపిచ్చిగా షర్మిల మాట్లాడితే టీఆర్ఎస్ బాధ్యత వహించదన్నారు.