ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున పేరు చివర రెడ్డి అనే పదం కనిపించడంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి మేరుగ నాగార్జున తాను దళిత బిడ్డ అన్న విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నారని వంగలపూడి అనిత సెటైర్ వేశారు. దళితుల మీదే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ…
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఏపీలో వైసీపీ చరిత్ర సృష్టించింది. 175 అసెంబ్లీ సీట్లకు 151 సీట్లను, 25 పార్లమెంట్ సీట్లకు 22 సీట్లను కైవసం చేసుకుని రికార్డు మెజారిటీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీని మట్టికరిపించి కనివినీ ఎరుగని రీతిలో వైసీపీ అద్భుత విజయం సాధించిన తేదీ మే 23. ఈ నేపథ్యంలో మరిచిపోలేని విజయాన్ని గుర్తు చేసుకుంటూ సోమవారం నాడు వైసీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. Somu Veerraju: ఏపీని అభివృద్ధి…
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్‌భాస్కర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కారులో డ్రైవర్ డెడీబాడీ దొరకడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఎమ్మెల్సీ విషయంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తారో లేదో పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. బీసీ సంఘానికి జాతీయ నాయకుడు ఆర్.కృష్ణయ్య లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే తప్పేంటని ప్రశ్నించారు. Nara…
ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారే.. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు సవాల్ విసిరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరం జిల్లా గరివిడిలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, మంత్రి బొత్సపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బొత్స సొంత జిల్లాలోనే రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహాన్ని శిరస్సు ఖండిస్తే దానిపై పోరాడి తిరిగి…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చగా మారింది.. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్యణ్యాన్ని హత్య చేశాడంటూ అనంతబాబుపై ఆరోపణలు వస్తున్నాయి.. ఈ తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. హత్య చేసిన అనంతబాబు.. సజ్జలను కలిశారంటూ విమర్శించిన ఆయన.. అనంతబాబును మరో 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. హత్య చేసి 72 గంటలైతే.. ఇప్పటి వరకు అరెస్ట్…
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం సృష్టించింది.. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఇక, నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతోంది టీడీపీ. మరోవైపు, దళిత…
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి…
అనకాపల్లిలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత సంక్షేమ పథకాల హామీలు విని జగన్ కు ఓటేసి గెలిపించారని, అమ్మఒడి అన్నాడు ఇప్పుడు ఏం చేశాడు 75 శాతం హాజరు ఉండాలి రూ.300 లోపు కరెంటు బిల్లు ఉండాలి అంటూ షరతులు పెట్టి పేర్లు తొలగించాడంటూ ఆయన విమర్శలు గుప్పించారు. దొంగలను పట్టుకోవలసిన పోలీసులు దొంగకు కాపలా కాయడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అంటూ…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న రాత్రి సుబ్రమణ్యం భార్యను, కుటుంబ సభ్యలు ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అంతేకాకుండా అర్థరాత్రి వీడియో నడుమ 5గురు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాకుండా సుబ్రమణ్యంది హత్యేనని ప్రాథమిక రిపోర్టు ఇచ్చారు. అయితే నేడు సుబ్రమణ్యం సొంతూరులో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో…
పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, జిల్లాలో ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేస్తున్నాం బొత్స 14 సంవత్సరాల అధికారంలోకి చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు రావాలని, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రెండు…