సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకు ఏకంగా 151 సీట్లలో ఘనవిజయం సాధించి మే 30, 2019న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా జగన్ ప్రభుత్వం…
వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలకృష్ణ ఆరోపిస్తున్నారని.. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. మీసం మెలేసి చెబుతున్నా.. బాలయ్య తాట తీస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పనిపడతారని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు…
వైసీపీ మంత్రులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ రెడ్డి, నేతలు, పార్టీ శ్రేణులు. బస్సు యాత్ర సందర్భంగా కిక్కిరిసింది నర్సరావుపేట. రాష్ట్రంలో సామాజిక న్యాయభేరీ యాత్ర చేసే హక్కు మాకే వుందన్నారు వైసీపీ మంత్రులు. నేల ఈనిందా? మహానాడు వేదిక పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదు. అచ్చెన్నాయుడుకు సిగ్గు లేదా? బీసీలకు చంద్రబాబు…
తెనాలి పెమ్మసాని థియేటర్లో నిర్వహించిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, అందులోని లింగాన్ని మింగేసే రకమని మండిపడ్డారు. ‘‘ఒక్క ఛాన్స్ అంటే, ఒక్క తప్పిదం చేశారు, ఓటు వేశారు, ఇకనైనా ఆత్మ విమర్శ చేసుకోండి’’ అంటూ ఏపీ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘దేశమంటే కట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని ఆనాడు గురజాడ అప్పారావు అన్నారు.…
వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్రను మంత్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్టీవో మాట్లాడుతూ… చంద్రబాబుకు ఎప్పుడూ శాపనార్థాలు పెట్టడం మినహా ఇంకేం వచ్చు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రోజూ మాట్లాడిన విషయాలు కాకుండా చంద్రబాబు కొత్తగా ఏమైనా చెప్పాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో జగన్ దూరిపోయి చెప్పాడా…
టీడీపీ మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా టీడీపీ శ్రేణులు. అయితే.. ఈ మహానాడు వేడుకల్లో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. టీడీపీ రధం చక్రాలు ఊడిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో క్విట్ చేశారని ఆయన అన్నారు. అందుకే హైదరాబాద్ వెళ్లి పోయాడని, లంకెలపాలెంలో మా యాత్రకు వచ్చినంత…
వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ఇవాళ మూడో రోజుకు చేరుకుంది. ఉదయం 9 గంటలకు పోలీస్ ఐలాండ్ సెంటర్ లో విగ్రహాలకు నివాళులు అర్పించి మూడో రోజు యాత్ర ప్రారంభించనున్నారు మంత్రుల. ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. 10.00 గంటలకు నారాయణపురం.. 10.45 కు ఏలూరు బైపాస్ మీదుగా 11.30 కి గన్నవరం చేరుకుంటుంది. 12.15కు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి వరకు యాత్ర సాగనుంది. అనంతరం మధ్యాహ్నం 1.30కి ఆచార్య…