క్షవరం అయితే గానీ.... వివరం తెలియదని అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన పార్టీకి ఇప్పుడు తత్వం బోధపడున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేవలం టింకరింగ్‌తో సరిపోదని, టాప్ టు బాటమ్ పార్టీని రీ స్ట్రక్చర్ చేయాలని అధిష్టానం డిసైడైందట.